బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: మంగళవారం, 28 ఆగస్టు 2018 (18:55 IST)

మారేడు ఆకులు మెల్లిగా నమిలి మింగుతుంటే అది తగ్గుతుంది...

మనం ప్రతిరోజు రకరకాల ఆహారపదార్థాలను తీసుకుంటూ ఉంటాం. మనం తినే కాయగూరలు, పండ్లతో పాటు ఆకుకూరలు కూడా మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఈ ఆకు కూరలవల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.

మనం ప్రతిరోజు రకరకాల ఆహారపదార్థాలను తీసుకుంటూ ఉంటాం. మనం తినే కాయగూరలు, పండ్లతో పాటు ఆకుకూరలు కూడా మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఈ ఆకు కూరలవల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.
 
1. నేల మునగ ఆకులు - ఆకులను నూరి నీటితో సేవిస్తే దగ్గు తగ్గును. ఇది మన శరీరమునకు దివ్యౌషధంలా పనిచేస్తుంది.
2. తులసీ ఆకులు- తులసి ఆకులను శుభ్రపరచుకొని రోజూ ఐదారు ఆకుల చొప్పున తినినచో దగ్గు, వాంతులు, జలుబు తగ్గుతాయి.
3. రావి ఆకులు- రావి ఆకులను మెత్తగా నూరి పొడి చేసి తేనెతో సేవిస్తే శ్వాసకోశవ్యాధులు నయం అవుతాయి. 
4. దానిమ్మ ఆకు- దానిమ్మ ఆకులను పొడిచేసి కషాయం కాచి త్రాగటం వలన అజీర్తి, ఉబ్బసం తగ్గుతాయి. గ్యాస్ ట్రబుల్ కంట్రోల్‌లో ఉంటుంది.
5. మారేడు ఆకులు- మారేడు ఆకుల్ని నమిలి రసాన్ని  నిదానంగా మింగాలి. కాయలోని గుజ్జుని ఎండబెట్టి పొడిచేసి మజ్జిగలో వేసుకొని త్రాగాలి. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల మూలశంక నయమగును.
6. తోటకూర- వారంలో కనీసం రెండు సార్లయినా తోటకూరను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
 7. కొత్తిమీర- కొత్తిమీరలో విటమిన్ ఎ, బి, భాస్వరం చాలా పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణశక్తిని పెంచటమే కాకుండా లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. డయోరియాతో బాధపడేవారికి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.
8. పుదీనా - ఇది శరీరంలోని వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది. వాంతులు, తలనొప్పి సమస్యలకు పుదీనా రసం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. కడుపునొప్పి, అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది. 
9. పాలకూర- పాలకూరలో ఎక్కువగా విటమిన్ సి, కాల్షియం, ఇనుము సమృద్దిగా ఉంటుంది.ఇందులో విటమిన్ ఇ ఎక్కువుగా ఉండటం వలన ఇది క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. దీనిలో ఉన్న విటమిన్ కె ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది.
10. గోంగూర- దీనిలో పొటాషియం, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండటంవలన రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. ఇందులో విటమిన్ ఎ అధికంగా ఉండటం వలన ఇది కంటిచూపు బాగా ఉండటానికి దోహదపడుతుంది.