బుధవారం, 27 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 28 ఆగస్టు 2018 (10:32 IST)

ఆవాలతో చెడు కొలెస్ట్రాల్ చెక్...

ఆవాల్లో న్యూటియన్స్, విటమిన్ బి3, ఎ, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజూ ఆవాలను తరచుగా ఆహారంలో చేర్చుకోవడం వలన రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను

ఆవాల్లో న్యూటియన్స్, విటమిన్ బి3, ఎ, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజూ ఆవాలను ఆహారంలో చేర్చుకోవడం వలన రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చును. హైబీపీని నియంత్రించుటలో ఆవాలు చాలా ఉపయోగపడుతాయి.
 
జీర్ణక్రియను పెంచుటలో ఆవాలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతాయి. ఆస్తమాతో బాధపడేవారు ఆవాలను ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో గల వ్యర్థ పదార్థాలను తొలగించుటలో ఆవాలు చాలా సహాయపడుతాయి. కీళ్లనొప్పులకు ఆవనూనెను ప్రతిరోజూ మర్దన చేసుకుంటే నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
ఆవాలను చప్పరిస్తే దంతాల నొప్పులు కూడా తగ్గుతాయి. ఇన్‌ఫెక్షన్స్‌ను తగ్గిస్తాయి. ఫ్లూ, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుండి కాపాడుతాయి. శరీరంలోని కొవ్వును కరిగించుటకు మంచిగా సహాయపడుతాయి. ఆవాలను పొడిచేసుకుని ప్రతిరోజూ పాలలో కలుపుకుని తీసుకుంటే హైబీపీ వంటి సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.