శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 27 ఆగస్టు 2018 (14:19 IST)

గోంగూరతో మటన్ కూర ఎలా చేయాలో చూద్దాం...

కావలసిన పదార్థాలు: మటన్‌ - అర కిలో గోంగూర - 3 కట్టలు తరిగిన పచ్చిమిర్చి - 6 పసుపు - 1 స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్ గరం మసాలా - 1 స్పూన్ తరిగిన ఉల్లిపాయ - 1 నూనె - 2 స్పూన్స్ కారం -

కావలసిన పదార్థాలు: 
మటన్‌ - అర కిలో 
గోంగూర - 3 కట్టలు 
తరిగిన పచ్చిమిర్చి - 6 
పసుపు - 1 స్పూన్ 
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
గరం మసాలా - 1 స్పూన్ 
తరిగిన ఉల్లిపాయ - 1 
నూనె - 2 స్పూన్స్
కారం - 2 టీ స్పూన్స్
ధనియాల పొడి - 1 స్పూన్ 
జీలకర్ర పొడి - 1/2 స్పూన్ 
ఉప్పు - తగినంత
 
తయారీ విధానం:  
ముందుగా కుక్కర్‌లో మటన్‌, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, కొద్దిగా ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసి నాలుగు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత బాణలిలో నూనె పోసి వేడయాక్కా ఉల్లిపాయలు, గరం మసాలా వేసి కాసేపు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, పచ్చిమిర్చి, గోంగూర వేసి బాగా కలిపి చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఆ తరువాత ఉడికించిన మటన్‌, తగినంత ఉప్పు వేసి కలిపి పది నిమిషాలు ఉడికించి దించేయాలి. అంతే...  గోంగూర మటన్ రెడీ.