సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 27 ఆగస్టు 2018 (15:08 IST)

ప్రతిరోజూ ఉదయాన్నే పొన్న బెరడు కషాయాన్ని తీసుకుంటే?

కీళ్లనొప్పులకు, వాతనొప్పులకు పొన్న గింజల తైలం దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఈ తైలాన్ని చర్మానికి రాసుకుంటే గజ్జి చిడుము వంటి చర్మ వ్యాధులు తొలగిపోతాయి. ఈ పొన్న చెట్టు బెరడును మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకో

కీళ్లనొప్పులకు, వాతనొప్పులకు పొన్న గింజల తైలం దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఈ తైలాన్ని చర్మానికి రాసుకుంటే గజ్జి, చిడుము వంటి చర్మ వ్యాధులు తొలగిపోతాయి. ఈ పొన్న చెట్టు బెరడును మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై గల గడ్డలకు రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 
ఈ పొన్న చెట్టు బెరడు కషాయాన్ని కొద్ది రోజుల పాటు ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే మూత్రపిండంలో రాళ్లను కరిగించుటకు చాలా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలానే ఈ పొన్న గింజలను మెత్తగా నూరుకుని చర్మానికి రాసుకుంటే కణుతులు తగ్గుతాయి. చర్మంపై గల పుండ్లతో బాధపడుతున్నవారు ఈ పొన్న గింజల తైలాన్ని రాసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది.