శనివారం, 25 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 27 ఆగస్టు 2018 (12:31 IST)

ఉల్లిపాయ మిశ్రమాన్ని కాలిన మచ్చలపై రాసుకుంటే?

చర్మంపై గల నల్ల మచ్చలు తొలగిపోయేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. రాత్రివేళ కొద్దిగా మెంతుల్ని నానబెట్టుకుని ఉదయాన్ని వాటిని పేస్ట్‌లా చేసుకుని మచ్చలపై రాసుకోవాలి. అరగంట తరువాత చల్లని నీటి

చర్మంపై గల నల్ల మచ్చలు తొలగిపోయేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. రాత్రివేళ కొద్దిగా మెంతుల్ని నానబెట్టుకుని ఉదయాన్ని వాటిని పేస్ట్‌లా చేసుకుని మచ్చలపై రాసుకోవాలి. అరగంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడు లేదా నాలుగు సార్లు చేయడం వలన కాలిన మచ్చలు తొలగిపోతాయి.
 
పెరుగులో కొద్దిగా పసుపు, నిమ్మరసం బార్లీ పొడి కలుపుకుని మచ్చలపై రాసుకోవాలి. ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే కూడా నల్లటి మచ్చలు పోతాయి. ఉల్లిపాయలను చిన్నముక్కలుగా కోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలున్న చోటరాసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. 
 
గుడ్డులోని తెల్లసొనలో కొద్దిగా తేనెను కలుపుకుని మచ్చలపై రాసుకోవాలి. ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే నల్లగా మారిన చర్మం కాస్త సాధారణ స్థితికి మారుతుంది. రోట్ వాటర్‌లో కొద్దిగా తేనె, పసుపు కలుపుకుని మచ్చలపై రాసుకోవాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే మచ్చలు తొలగిపోతాయి. క్యారెట్ మిశ్రమాన్ని మచ్చలపై రాసుకుంటే కూడా నల్లటి వలయాలు తొలగిపోతాయి.