బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 24 ఆగస్టు 2018 (10:45 IST)

శివునికి కొబ్బరి నీళ్లతో అభిషేకాలు చేస్తే?

భక్తులను అనుగ్రహించడంలో పరమశివుడు చాలా గొప్పవారు. చాలామంది భక్తుల కథలు ఈ విషయాన్ని నిరూపిస్తాయి. సదా శివునికి అభిషేకం చేయడం వలన ప్రీతి చెందుతాడు. ఒక్కోరకమైన శివలింగాన్ని అభిషేకించడం వలన ఒక్కో ఫలితం ఉం

భక్తులను అనుగ్రహించడంలో పరమశివుడు చాలా గొప్పవారు. చాలామంది భక్తుల కథలు ఈ విషయాన్ని నిరూపిస్తాయి. సదా శివునికి అభిషేకం చేయడం వలన ప్రీతి చెందుతాడు. ఒక్కోరకమైన శివలింగాన్ని అభిషేకించడం వలన ఒక్కో ఫలితం ఉంటుందని, అభిషేక ద్రవ్యంతో స్వామిని అభిషేకించడం వలన ఒక్కో విశేషమైన ఫలితం కలుగుతుందని చెబుతున్నారు.
 
శివలింగాలను పాలతో, పెరుగుతో, నెయ్యితో, తేనెతో, కొబ్బరి నీళ్లతో అభిషేకాలు చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయడం వలన దుఃఖం నశిస్తుందని మహర్షుల మాట. జీవితంలో ఆపదలు, అనారోగ్యాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అవమానాలు దుఃఖాన్ని కలుగుజేస్తుంటాయి. 
 
అంతేకాకుండా దుఃఖం జీవితాన్ని మరింత భారం చేస్తుంటుంది. అలాంటి దుఃఖానికి దూరంగా ఉండాలంటే పరమశివునికి అనునిత్యం కొబ్బరి నీళ్లతో అభిషేకాలు చేయవలసి ఉంటుంది. తద్వారా దుఃఖం నుండి విముక్తులు కానవచ్చును.