సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 21 ఆగస్టు 2018 (15:17 IST)

ఈ రోజున హనుమంతుని నైవేద్యంగా ఏం పెట్టాలో తెలుసా?

హనుమంతుడు ఎంతటి పరాక్రమవంతుడో అంతటి బుద్ధిశాలి. ఏ సమయంలో పరాక్రమించాలో, ఎప్పుడు బుద్ధిని ఉపయోగించాలనే విషయం తెలిసిన వాడు హనుమంతుడు. ఎక్కడ రామనామ స్మరణ జరుగుతున్నా ఎక్కడ హనుమ ఆరాధన జరుగుతున్నా అక్కడికి

హనుమంతుడు ఎంతటి పరాక్రమవంతుడో అంతటి బుద్ధిశాలి. ఏ సమయంలో పరాక్రమించాలో, ఎప్పుడు బుద్ధిని ఉపయోగించాలనే విషయం తెలిసినవాడు హనుమంతుడు. ఎక్కడ రామనామ స్మరణ జరుగుతున్నా ఎక్కడ హనుమ ఆరాధన జరుగుతున్నా అక్కడికి తప్పకుండా హనుమంతుడు వస్తాడు. అంతేకాకుండా తన కరుణాకటాక్ష వీక్షణాలు కూడా కురిపిస్తాడు.
 
అటువంటి హనుమంతుని మంగళ, శనివారాల్లో పూజించడం వలన గ్రహ సంబంధ దోషాలు తొలగిపోతాయని పురాణాలలో చెప్పబడింది. ఈ రోజుల్లో ఉపవాస దీక్షను చేపట్టి హనుమంతునిని పూజించవలసి ఉంటుంది. ముఖ్యంగా పూజలో సువాసన భరితమైన పువ్వులను ఉపయోగించాలి.
 
హనుమంతునికి ఇష్టమైన గోధుమ పిండితో చేసిన అప్పాలను నైవేద్యంగా పెట్టాలి. ఈ రోజుల్లో ఈ విధంగా చేయడం వలన హనుమంతుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. తద్వారా తలపెట్టిన కార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగిపోతాయి.