శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Kowsalya
Last Updated : గురువారం, 16 ఆగస్టు 2018 (21:50 IST)

ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తే?

జీవితంలోని అవసరాలను, ఆపదలను తొలగించాలన్నా, ఆనందంగా ఉండాలన్నా ధనం చాలా అవసరం. ఎందుకంటే అవసరాలకు చాలా ముఖ్యమైనది ధనం కాబట్టే. ఈ కాలంలో ఏ విషయం చేయాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా ధనం ఉండాలి. కొన్ని అవసరాలను

జీవితంలోని అవసరాలను, ఆపదలను తొలగించాలన్నా, ఆనందంగా ఉండాలన్నా ధనం చాలా అవసరం. ఎందుకంటే అవసరాలకు చాలా ముఖ్యమైనది ధనం కాబట్టే. ఈ కాలంలో ఏ విషయం చేయాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా ధనం ఉండాలి. కొన్ని అవసరాలను ధనం తీర్చకపోయిన చాలావరకూ సమకూర్చేది ధనమే. అందుకే చాలామంది సంపదను పెంచుకోవడానికి శ్రద్ధ చూపుతుంటారు.
   
 
అలాంటి సంపదకు కొరత లేకుండా ఉండాలంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. అంతేకాకుండా ఉదయాన్నే వాకిట్లో ముగ్గు పెట్టే ఇళ్లంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం. ముగ్గు పెట్టే వాకిట్లో లక్ష్మీదేవి తప్పకుండా ఉంటారని శాస్త్రంలో చెప్పబడుతోంది. ప్రతిరోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకుని పూజా మందిరంలో దీపం పెట్టితే లక్ష్మీదేవి అమ్మవారికి ఆనందం కలుగుతుంది.  
 
గుమ్మంలో నుండి చూస్తే పెరట్లో అరటి చెట్టు, తులసి మెుక్క కనిపిస్తే ఇక లక్ష్మీదేవి ఆ ఇంట్లో తప్పకుండా ఉంటారు. కుటుంబ సభ్యులంతా సఖ్యతతో ప్రశాంతమైన, ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతుంటే లక్ష్మీదేవి అక్కడే స్థిరనివాసం చేస్తారని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడింది.