సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 14 ఆగస్టు 2018 (13:54 IST)

ప్రతి మంగళవారం 'హనుమాన్ చాలీసా' పఠిస్తే?

మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన పనులను మనం సక్రమంగా చేసుకోగలుగుతాము. అలానే ఆరోగ్యంగా ఉన్నప్పుడే జీవితం కూడా సంతోషంగా, సంతృప్తికరంగా ఉంటుంది. అందుకే అందరు అనారోగ్యాలతో బాధపడకూడదని దైవాన్ని ప్రార్థిస్తుంటార

మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన పనులను మనం సక్రమంగా చేసుకోగలుగుతాము. అలానే ఆరోగ్యంగా ఉన్నప్పుడే జీవితం కూడా సంతోషంగా, సంతృప్తికరంగా ఉంటుంది. అందుకే అందరు అనారోగ్యాలతో బాధపడకూడదని దైవాన్ని ప్రార్థిస్తుంటారు. ఏదైనా ఒక శుభకార్యం చేయాలనుకున్నప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగితేనే ఆందోళనకు గురవకుండా సంతోషంగా ఉంటారు.
 
విజయాన్ని సాధించిన అనుభూతులు ఇక ఎందులోను ఉండవు. కాబట్టి ముఖ్యంగా మనం చేయాలనుకున్న కార్యాలు ఏ ఆటంకాలు లేకుండా జరగాలని దైవాన్ని ప్రార్థిస్తుంటాం. అందుకు నిదర్శనం హనుమంతుడు. హనుమంతుని ఆరాధించిడం వలన కార్యసిద్ధి కలుగుతుందని, అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడుతోంది. 
 
ప్రతి మంగళవారం, శనివారాల్లో  హనుమంతునికి ఆలయాలలో గాని, పూజా మందిరంలో గాని కూర్చుని హనుమాన్ చాలీసా అని 11 సార్లు పారాయణ చేయడం వలన ఆ స్వామి అనుగ్రహం దక్కుతుందని గ్రంధాలలో చెబుతున్నారు. ముఖ్యంగా భక్తి శ్రద్ధలతో ఇలాంటి పూజలు చేయడం వలన తప్పకుండా హనుమంతుని అనుగ్రహం లభించడమే కాకుండా మీరు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి.