శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Kowsalya
Last Updated : శనివారం, 11 ఆగస్టు 2018 (18:13 IST)

మామిడి పండ్ల రసంతో శివలింగాలకు అభిషేకాలు చేస్తే...

బంగారు శివలింగం, ఇత్తడి శివలింగం, రాగి శివలింగం, స్పటిక శివలింగం, మట్టి శివలింగం ఇలా వివిధ రకాల శివలింగాలున్నాయి. ఒక్కో శివలింగానికి అభిషేకం చేయడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చునని ఆధ్యాత్మిక గ్రంధాల

బంగారు శివలింగం, ఇత్తడి శివలింగం, రాగి శివలింగం, స్పటిక శివలింగం, మట్టి శివలింగం ఇలా వివిధ రకాల శివలింగాలున్నాయి. ఒక్కో శివలింగానికి అభిషేకం చేయడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చునని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడుతోంది. ద్రాక్ష రసం, నేరేడు పండ్ల రసం, చెరకు రసం, మామిడి పండ్ల రసాలతో పరమశివునికి అభిషేకాలు చేయడం వలన ధనధాన్యాలు చేకూరుతాయి.
 
ముఖ్యంగా మామిడి పండ్ల రసంతో పరమశివునికి అభిషేకం చేయడం వలన ధనం చేకూరుతుందని శాస్త్రంలో స్పష్టం చేయబడుతోంది. అంతేకాకుండా ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అత్యంత భక్తిశ్రద్ధలతో శివునికి ఈ విధంగా అభిషేకాలు చేయడం వలన సిరసంపదలతో సంతోషంగా ఉంటారని చెప్పబడుతోంది.