1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
  4. neem flower mango pickle recipe

వేపపువ్వుల పచ్చడి తయారీ విధానం.....

వేపపువ్వును భారతీయులు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వేపపువ్వులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేపపువ్వులోని ఔషధ గుణాలు అనారోగ్య సమస్యలను తేలిగ్గా పరిష్కరిస్తాతాయి. వేపపువ్వులో యాంటీ బాక్టీరియల్, యాంటి స

neem
వేపపువ్వును భారతీయులు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వేపపువ్వులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేపపువ్వులోని ఔషధ గుణాలు అనారోగ్య సమస్యలను తేలిగ్గా పరిష్కరిస్తాతాయి. వేపపువ్వులో యాంటీ బాక్టీరియల్, యాంటి సెప్టిక్ గుణాలుంటాయి. వేపపువ్వు చర్మానికి, జుట్టు, ఆరోగ్యానికి కూడా అద్భుత ఫలితాలను అందిస్తుంది. మరి ఇటువంటి వేపపువ్వుతో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు: 
వేపపూత - 2 స్పూన్స్
పచ్చిమామిడికయా - 1
బెల్లం తురుము - 4 స్పూన్స్
చింతపండు గుజ్జు - 1 స్పూన్
నీళ్లు - కప్పు
కారం - చిటికెడు
ఉప్పు - తగినంతా
 
తయారీ విధానం: 
ముందుగా చింతపండును నీటిలో ఓ అరగంట పాటు నానబెట్టుకుని దానిని గుజ్జులా తయారుచేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన మామిడికాయ ముక్కల్ని ఆ చింతపండు గుజ్జులో వేసి కలుపుకోవాలి. ఆ తరువాత బెల్లంపొడి వేసి బాగా కలుపుకుని అందులో ఉప్పు, కారం, వేపపువ్వు వేసి కలుపుకుంటే వేపపువ్వు పచ్చడి రెడీ. 
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
కీరదోసను సలాడ్‌లో చేర్చుకుంటే.. హైబీపీ ఇట్టే తగ్గిపోతుంది..