మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By Kowsalya
Last Updated : శనివారం, 14 జులై 2018 (16:09 IST)

మామిడిపండుతో కుల్ఫీనా? ఎలా చేయాలో చూద్దాం?

మామిడిపండులో ఉండే పొటాషియం, మెగ్నిషియం అధిక రక్తపోటు సమస్యను నివారిస్తుంది. విటమిన్ సి, ఫైబర్ శరీరంలో హాని చేసే కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మామిడి పండును తినడం వల్ల పంటినొప్పి, చిగుళ్ల సమస్యలు, చిగుళ

మామిడిపండులో ఉండే పొటాషియం, మెగ్నిషియం అధిక రక్తపోటు సమస్యను నివారిస్తుంది. విటమిన్ సి, ఫైబర్ శరీరంలో హాని చేసే కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మామిడి పండును తినడం వల్ల పంటినొప్పి, చిగుళ్ల సమస్యలు, చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్యలు దూరమవుతాయి. నోటిలోని బ్యాక్టీరియాలను నశిస్తుంది. పంటిపై ఎనామిల్ కూడా దృడంగా ఉంటుంది. మరి ఇటువంటి మామిడిపండుతో కుల్ఫీ ఎలా తయారుచేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు:
పాలు - ఒకటిన్నర కప్పు
చక్కెర - పావుకప్పు
మెుక్కజొన్నపిండి - 1 స్పూన్
మామిడిగుజ్జు - అరకప్పు
చిక్కగా మరిగించిన పాలు - పావుకప్పు
యాలకులపొడి - 1/2 స్పూన్
 
తయారీ విధానం:
ముందుగా బాణలిలో పాలు చక్కెర తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అవి సగమయ్యాక మెుక్కజొన్న పిండి కలుపుకోవాలి. ఇవి మరిగాక చిక్కగా మరిగించిన పాలను పోసి మంట తగ్గించి కలుపుతూ ఉండాలి. 5 నిమిషాల తరువాత యాలకులపొడి వేసి దింపేయాలి. ఇప్పుడు పాల మిశ్రమం, మామిడిపండు గుజ్జులో వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. దీన్ని కుల్ఫీ పాత్రలో తీసుకుని 8 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచి తీసేయాలి. అంతే మామిడిపండు కుల్ఫీ రెడీ.