సోమవారం, 6 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By Kowsalya
Last Updated : గురువారం, 12 జులై 2018 (14:07 IST)

గుడ్డుతో కట్‌లెట్ తయారీనా? ఎలా చేయాలో చూద్దాం?

ఇంట్లో సులభంగా కూరలు చేసుకునే గుడ్డుతో ఎన్నో రకాల రుచికరమైన వంటకాలను చేసుకోవచ్చును. వర్షాకాలానికి సూచనగా అప్పుడప్పుడు ఇలాంటి స్నాక్స్ తీసుకుంటే మంచిది. తక్కువ సమయంలో రుచికరమైన స్నాక్ రెసిపీ ఎలా తయారుచ

ఇంట్లో సులభంగా కూరలు చేసుకునే గుడ్డుతో ఎన్నో రకాల రుచికరమైన వంటకాలను చేసుకోవచ్చును. వర్షాకాలానికి సూచనగా అప్పుడప్పుడు ఇలాంటి స్నాక్స్ తీసుకుంటే మంచిది. తక్కువ సమయంలో రుచికరమైన స్నాక్ రెసిపీ ఎలా తయారుచేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు:
ఉడికించిన గుడ్లు - 4
బంగాళాదుంపలు - 4 
ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 స్పూన్స్
పచ్చిమిర్చి - 2
పసుపు - 1 స్పూన్
గరంమసాలా - స్పూన్
ధనియాల పొడి - 2 స్పూన్స్
కొత్తిమీర - అరకప్పు
కరివేపాకు - 2 రెబ్బలు
గుడ్లు - 2
బ్రెడ్‌పొడి - అరకప్పు
నూనె - సరిపడా
 
తయారీ విధానం:
ముందుగా బాణలిలో నూనెను వేడిచేసి తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు, కొంచెం ఉప్పు వేసి బాగా వేయించాలి. ఇప్పుడు ఉడికించిన గుడ్లను ముక్కలుగా కోసుకోవాలి. బంగాళాదుంపలను ఉడికించి వాటి పొట్టుతీసి మెత్తగా చిదిమి పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కులు వేగాక అందులో పసుపు, కారం, ధనియాల పొడి, గరంమసాలా వేయాలి. ఆ తరువాత చిదిమిన బంగాళాదుంపలు, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు చేతిలో నూనెను రాసుకుని ఆలూ మిశ్రమాన్ని చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఆ తరువాత ఓ ముద్ద తీసుకుని కాస్త వెడల్పుగా చేసి అందులో గుడ్డు ముక్కను పెట్టి మూసివేయాలి. మిగిలినవాటిన్ననీ ఇలా చేసుకోవాలి. గుడ్డును గిలకొట్టి అందులో ఆ గుడ్డు ముక్కలను ముంచి బ్రెడ్ పొడిలో కలుపుకోవాలి. మరో బాణలిలో నూనెను వేడిచేసి ఆ గుడ్డు ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. అంటే ఎగ్ కట్‌లెట్స్ రెడీ.