శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Kowsalya
Last Updated : శనివారం, 7 జులై 2018 (17:56 IST)

చామదుంపలు పుట్నాల వేపుడు తయారీ విధానం....

చామదుంపలను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుటలో సహాయపడుతుంది. ఇందులోని పీచు, యాంటీ ఆక్సిడెంట్స్ బరువును తగ్గిస్తాయి. ఇవి శరీరంలోని టాక్సిన్లను బయటకు పం

చామదుంపలను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుటలో సహాయపడుతుంది. ఇందులోని పీచు, యాంటీ ఆక్సిడెంట్స్ బరువును తగ్గిస్తాయి. ఇవి శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడం ద్వారా ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు. రక్తంలోని చక్కెర శాతాన్ని ఇది అదుపులో ఉంచుతుంది. శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. ఇలాంటి చామదుంపతో వేపుడ ఎలా తయారుచేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు: 
చామదుంపలు - పావు కేజీ
పుట్నాల పప్పు - అరకప్పు
పల్లీలు - అరకప్పు
జీడి పప్పు - కొద్దిగా
ఎండు కొబ్బరి పొడి - 3 స్పూన్స్
వెల్లుల్లి రెబ్బలు - 4
ఎండుమిరపకాయలు - 3
జీలకర్ర - 3 స్పూన్స్ 
పసుపు - చిటికెడు
ఉప్పు - సరిపడా 
మినప్పప్పు - 3 స్పూన్స్ 
కారం - 1 స్పూన్
నూనె - తగింత
 
తయారీ విధానం: 
ముందుగా ఒక బాణలిలో మినప్పప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పల్లీలు కొద్దిగా నూనె వేసి వేగించి, చల్లారాక అందులో పుట్నాల పప్పు, ఉప్పు వేసి మిక్సీలో పట్టుకోవాలి. మరో బాణలిలో నూనె పోసి ఉడికించిన చామదుంప ముక్కలను దోరగా వేగించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ వేగించిన ముక్కల్లో పుట్నాల మిశ్రమం పొడి, ఎండుకొబ్బరి పొడి, పసుపు, కారం, వేగించిన జీడిపప్పు వేసి కొత్తిమీర చల్లుకోవాలి. అంతే చామదుంపల పుట్నాల వేపుడు రెడీ.