బుధవారం, 27 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 10 జులై 2018 (09:40 IST)

చర్మం దురదలకు పాలను రుద్దుకుంటే?

చర్మం పొడిబారకుండా ఉండాలంటే అరటిపండును గుజ్జులా చేసి అందులో స్పూన్ తేనె వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత కడిగేసుకుంటే చర్మం తేమగా మారుతుంది. బొప్పాయి గుజ్జు

చర్మం పొడిబారకుండా ఉండాలంటే అరటిపండును గుజ్జులా చేసి అందులో స్పూన్ తేనె వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత కడిగేసుకుంటే చర్మం తేమగా మారుతుంది. బొప్పాయి గుజ్జులో ఒక గుడ్డు సొన, అరచెంచా నిమ్మరసం వేసుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి.
 
దీన్ని ముఖానికి పట్టింటి కాసేపయ్యాక చన్నీళ్లతో కడిగేసుకుంటే మురికి జిడ్డూ వదిలిపోతాయి. గుడ్డుసొనలో కొద్దిగా మయోనైజ్, చెంచా నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకుని ముఖానికి పూతలా వేసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా మారుతుంది. వదులుగా మారిన చర్మం బిగుతుగా మారాలంటే గుడ్డులోని తెల్లసొనను గిలకొట్టి ముఖానికి రాసుకోవాలి. ఆరాక కడిగేసుకుంటే చర్మం అందంగా మారుతుంది. 
 
ముఖచర్మం విపరీతంగా దురదగా ఉండే పాలలో దూదిని ముంచి ముఖానికి రాసుకుంటే దురదలు తగ్గిపోతాయి. మోకాళ్లూ బరకగా ఉన్నవారు స్పూన్ ఓట్‌మీల్‌‌ని మెత్తగా పొడిచేసుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని మోకాళ్లకు రాసుకుని 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే మోకాళ్లు మృదువుగా తయారవుతాయి.