శనివారం, 25 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : శనివారం, 7 జులై 2018 (16:22 IST)

పుదీనా గుజ్జులో కాస్త నిమ్మరసం కలిపి తీసుకుంటే?

మెత్తగా నూరిన పుదీనా ఆకుల ముద్దలో కాస్త నిమ్మరసం వేసి కళ్ల కింద నల్లటి వలయాలపై తరచూగా రాసుకుంటే కొద్ది రోజులకు మచ్చలు తొలగిపోతాయి. కీర దోసకాయను గుండ్రటి ముక్కలుగా కట్ చేసి కనురెప్పలపై 10 నిమిషాల పాటు

మెత్తగా నూరిన పుదీనా ఆకుల ముద్దలో కాస్త నిమ్మరసం వేసి కళ్ల కింద నల్లటి వలయాలపై తరచూగా రాసుకుంటే కొద్ది రోజులకు మచ్చలు తొలగిపోతాయి. కీర దోసకాయను గుండ్రటి ముక్కలుగా కట్ చేసి కనురెప్పలపై 10 నిమిషాల పాటు అలానే ఉంచుకోవాలి. రోజూ ఇలా చేస్తే కళ్లకు అలసట తీరడమే కాకుడా కనుల కింద నల్లటి వలయాలు క్రమంగా అంతరించిపోతాయి.
 
రోజ్‌వాటర్‌లో ముంచిన దూదితో కనురెప్పలపైన, క్రింద తుడుచుకోవాలి. ఇలా రెండు, మూడు వారాలు చేస్తే కళ్ల కింద నల్లటి చారలు తొలగిపోతాయి. కాల్చిన అల్లం ముక్కలపై ఉప్పు లేదా దానిమ్మ రసం వేసుకుని తింటే నోరు పరిశుభ్రమవడమే కాకుండా అరుచి లక్షణాలు పోతాయి.
 
బంగాళాదుంప గుజ్జులో రెండు చెంచాలా ఓట్స్, రెండు చెంచాల పాలు, రెండు చుక్కల తేనె, అర చెంచా ఆలివ్‌ నూనెను కలుపుకుని ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి బాగా మర్దన చేయాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.
 
ముడతలు పడిన చర్మం కాంతివిహీనంగా కనిపించేలా చేస్తుంది. బొప్పాయిని మెత్తని గుజ్జులా చేసుకుని అందులో కొద్దిగా వరిపిండి, పాలు, కోడిగుడ్డులోని తెల్లసొన, నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకుంటే చర్మంపై ఉన్న ముడతలు తగ్గి ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.