ప్రతిరోజూ ఉదయాన్నే నిమ్మరసాన్ని త్రాగితే?

ఉదయం లేవగానే గోరు వెచ్చటి నిమ్మరసాన్ని తాగడం ఆరోగ్యానికి మంచిది. కాఫీ, టీలకు బదులు నిమ్మరసం తీసుకోవడం ఉత్తమమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిమ్మరసాన్ని తీసుకోవడం వలన గ్యాస్ట్రో సిస్టం మెరుగుపడుతుంద

lemon juice
Kowsalya| Last Updated: శుక్రవారం, 6 జులై 2018 (11:43 IST)
ఉదయం లేవగానే గోరువెచ్చటి నిమ్మరసాన్ని తాగడం ఆరోగ్యానికి మంచిది. కాఫీ, టీలకు బదులు నిమ్మరసం తీసుకోవడం ఉత్తమమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిమ్మరసాన్ని తీసుకోవడం వలన గ్యాస్ట్రో సిస్టం మెరుగుపడుతుంది. శరీరంలో న్యూట్రియన్స్, ఇతర మినరల్స్ గ్రహించే శక్తిని పెంచుతుంది. దీంతో పలు వ్యాధులకు దూరంగా ఉండవచ్చును.
 
నిమ్మలో ఉండే ఆల్కలైన్ లక్షణాలు శరీరంలోని మాలిన్యాలను తొలగించడంలో అమోహంగా పనిచేస్తుంది. నిమ్మ అసిడిక్‌గా అనిపించినప్పటికీ దీంట్లోని మంచి గుణాలు శరీరంలో పీహెచ్ విలువలను సమతుల్యంగా చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. నిమ్మకాయలో ఉండే పెక్టిన్ అనే ప్రత్యేక ఫైబర్ పదార్థం వలన బరువు తగ్గాలనుకునే వారికి ఇది దివ్యౌషధం సహాయపడుతుంది.
 
దీంతో మెటబాలిజం రేటు మెరుగుపడుతుంది. మసాలాలు, జంక్‌ఫుడ్ వంటివి తిన్నప్పుడు ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి సమస్యలు నుండి విముక్తికి నిమ్మరసం తాగడం ఉత్తమని ఆరోగ్య నిపుణులు తెలియజేశారు.దీనిపై మరింత చదవండి :