బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 5 జులై 2018 (10:35 IST)

పగటి పూట వేప చెట్టు కింద నిద్రిస్తే... ?

నలభై రకాల వ్యాధులకు వేపాకు చాలా ఉపయోగపడుతుంది. శీతోష్ట వాతావరణం కలిగి ఉండే భరతఖండమే వేపాకు పుట్టిల్లు. వేప బెరడు, ఆకులు, పువ్వు, పండు ఇలా తన సర్వస్వాన్ని మనిషి ఆరోగ్యం కోసం ధారపోసే సర్వరోగ నివారిణి ఈ

నలభై రకాల వ్యాధులకు వేపాకు చాలా ఉపయోగపడుతుంది. శీతోష్ట వాతావరణం కలిగి ఉండే భరతఖండమే వేపాకు పుట్టిల్లు. వేప బెరడు, ఆకులు, పువ్వు, పండు ఇలా తన సర్వస్వాన్ని మనిషి ఆరోగ్యం కోసం ధారపోసే సర్వరోగ నివారిణి ఈ వేపాకు. పగటిపూట వేపచెట్టు కింద నిద్రించినవాళ్లు ఆరోగ్యంగా ఎక్కువకాలం జీవిస్తారని ప్రాచీన ఆయుర్వేద పరిశోధనలో తెలుపబడెను.
 
పళ్లు తోముకునే పుల్ల నుండి సౌందర్య సాధనాలు, ఔషధాల తయారీ వరకు వేపాకు చాలా సహాయపడుతుంది. వేపాకుల్లో, పువ్వుల్లో ఉండే నింబోలైడ్ అనే రసాయనం పలు రకాల క్యాన్సర్ వ్యాధులనుండి ఉపశమనం కలిగిస్తుంది. వేపాకు బ్యాక్టీరియా, ఫంగస్ నివారణకు చాలా ఉపయోగపడుతుంది. చర్మ సంబంధ వ్యాధుల్ని తరిమికొట్టేందుకు చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. 
 
వేపాకును కాల్చితే ఆ పొగకు ఇంట్లోని దోమలు నుండి విముక్తి చెందవచ్చును. చర్మంపై ఉండే ఇరిటేషన్, చర్మం ఎర్రబడిపోవడం వంటి వాటికి వేపనూనెను తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. వేపలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. దీని వలన చర్మం వాతావరణ కాలుష్యం నుండి తప్పించుకోవచ్చను.