బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 5 జులై 2018 (19:37 IST)

ప్రతిరోజూ తోటకూరను తీసుకుంటే?

ఆకుకూరల్లో తోటకూర 'రాణి' వంటిదని అంటారు. దీనిలో పెరుగు తోటకూర, ఎర్ర తోటకూర, చిలక తోటకూర వంటి పలురకాలున్నాయి. తోటకూరలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో క్యాల్షియం, ఇనుము, మెగ్నీషియం, ప

ఆకుకూరల్లో తోటకూర 'రాణి' వంటిదని అంటారు. దీనిలో పెరుగు తోటకూర, ఎర్ర తోటకూర, చిలక తోటకూర వంటి పలురకాలున్నాయి. తోటకూరలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో క్యాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పాస్పరస్‌, జింక్‌, కాపర్‌, మాంగనీస్‌, సెలీనియం వంటి ఖనిజాలు చాలా లభిస్తాయి. రక్తనాళాల్ని చురుగ్గా ఉంచి గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియం వంటివి కూడా సమకూరుతాయి.
 
ప్రతిరోజు కనీసం 200 గ్రాముల తోటకూరను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు. రెగ్యులర్‌గా తోటకూరను తీసుకుంటే రక్తహీనత నుండి విముక్తి చెందవచ్చును. బరువు తగ్గాలనుకునేవాళ్లు రెగ్యులర్‌గా తోటకూర తినడం ఉత్తమం. ఇందులోని పీచుపదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. శరీరంలోని కొవ్వును తగ్గించేందుకు చాలా ఉపయోగపడుతుంది.
 
తోటకూరలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. మెులల వ్యాధికి ఈ తోటకూర మంచి ఔషధంగా పనిచేస్తుంది. తోటకూరలో విటమిన్ ఎ, సి, డి, ఇ, కె, బి12, బి6 వంటివి ఎక్కువగా లభిస్తాయి. ఇది క్యాలరీల శక్తిని పెంచుటలో చాలా సహాయపడుతుంది.