శనివారం, 25 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By chj
Last Modified: శుక్రవారం, 6 జులై 2018 (20:56 IST)

వేపాకు ముద్దకు పెసర పిండి కలిపి ముఖానికి రాసుకుంటే?

ప్రతిరోజు రెండు పూటలా స్నానం, ముఖానికి సబ్బు, చర్మం కాంతివంతంగా ఉండడానికి ఓ మాయిశ్చరైజర్.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలనుకుంటారు చాలా మంది మహిళలు. అయితే వీటితో పాటు చర్మ సంరక్షణలో భాగంగా ముఖ్యమైనది మృతకణాలను తొలగించుకోవడం. వీటిని ఎప్పటికప్పుడు తొలగించు

ప్రతిరోజు రెండు పూటలా స్నానం, ముఖానికి సబ్బు, చర్మం కాంతివంతంగా ఉండడానికి ఓ మాయిశ్చరైజర్.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలనుకుంటారు చాలా మంది మహిళలు. అయితే వీటితో పాటు చర్మ సంరక్షణలో భాగంగా ముఖ్యమైనది మృతకణాలను తొలగించుకోవడం. వీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోకపోతే చర్మం నిర్జీవంగా మారి కళ తప్పి పొడిబారినట్లవుతుంది. మరి వీటిని సహజమైన పదార్థాలను ఉపయోగించి ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. వేపాకుల్ని ముద్దలాగా చేసి కాస్త పెసరపిండి , చెంచా ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి రాసుకుని మృదువుగా రుద్దాలి.  ఇలా చేయడం వల్ల నల్ల మచ్చలు, మృత కణాలు తొలగిపోయి చర్మం నునుపుగా తయారవుతుంది.
 
2. ఒక చెంచా కొబ్బరి నూనె, ఒక చెంచా ఆలివ్ నూనె బాగా కలిపి ఇందులో మూడు చెంచాల చక్కెర కలిపి ముఖానికి మిగతా శరీరానికి రాసి కొన్ని నిముషాల పాటు మృదువుగా  మర్దనా చేయాలి. పది నిముషాలు ఆగి గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. చక్కెర చర్మంపై పేరుకున్న మృతకణాలను తొలగిస్తుంది. అదేవిధంగా నూనె చర్మానికి కావలసిన తేమను, పోషణను అందిస్తుంది.
 
3. అరకప్పు  ఓట్స్ పొడిలో సరిపడా తేనె వేసి బాగా కలపాలి. దీనిని ముఖానికి, మెడకు పట్టించి బాగా మర్దనా చేయాలి. ఇది పూర్తిగా ఆరాక కడిగివేయాలి. ఇలా వారానికొకసారి చేసే మృతకణాలు పోవడమే కాదు... చర్మం కూడా మృదువుగా మారుతుంది.
 
4. కలబంద గుజ్జులో కాస్త నిమ్మరసం కలిపి ముఖం, మెడ, చేతులపై రాసుకుంటే నలుపుదనం తగ్గుతుంది. చర్మం తాజాగా ఉంటుంది.