శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : గురువారం, 5 జులై 2018 (12:39 IST)

చర్మం పొడిబారకుండా ఉండాలంటే?

చర్మం పొడిబారకుండా ఉండాలంటే చర్మానికి మాయిశ్చరైజింగ్ ఇచ్చే స్క్రబ్‌ను వాడాలి. ఈ స్క్రబ్ తయారీకి ఒక కప్పు బ్రౌన్ షుగర్, అరకప్పు బాదం నూనె, రెండు స్పూన్స్ తేనె తీసుకుని ఒక పాత్రలో వేసి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, చేతులు, భుజాలతో పాటు

చర్మం పొడిబారకుండా ఉండాలంటే చర్మానికి మాయిశ్చరైజింగ్ ఇచ్చే స్క్రబ్‌ను వాడాలి. ఈ స్క్రబ్ తయారీకి ఒక కప్పు బ్రౌన్ షుగర్, అరకప్పు బాదం నూనె, రెండు స్పూన్స్ తేనె తీసుకుని ఒక పాత్రలో వేసి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, చేతులు, భుజాలతో పాటు శరీరమంతా మలయాకారంగా రుద్దుతూ మర్దనా చేసుకోవాలి.
 
ఆ తరువాత నలుగుపిండితో స్నానం చేయాలి. ఇలా చేయడం వలన ముఖచర్మం అందంగా కాంతివంతంగా మారుతుంది. స్పూన్ మూల్తానీ మట్టిలో కాస్త మీగడ, తేనె, బాదం నూనెను ఒక బౌల్‌లో కలుపుకుని ముఖానకి ప్యాక్‌లా వేసుకుని 15 నిమిషాల తరువాత చల్లని నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలాచేస్తే చర్మం పొడి బారకుండా, కాంతివంతంగా తయారవుతుంది.