శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 3 జులై 2018 (13:54 IST)

ముడతల చర్మానికి చందనం రాసుకుంటే?

ఈ కాలంలో మహిళల చర్మం నల్లగా మారడం సహజమే. అదేవిధంగా మెుటిమలు కూడా సర్వసాధారణంగా ఎదురయ్యే సమస్యలు. వీటిని అదుపులో ఉంచాలంటే చందనం వాడితే మంచి ఫలితాలను పొందవచ్చును. చందనంలో కాస్త గులాబీనీరు కలిపి ముఖానికి

ఈ కాలంలో మహిళల చర్మం నల్లగా మారడం సహజమే. అదేవిధంగా మెుటిమలు కూడా సర్వసాధారణంగా ఎదురయ్యే సమస్యలు. వీటిని అదుపులో ఉంచాలంటే చందనం వాడితే మంచి ఫలితాలను పొందవచ్చును. చందనంలో కాస్త గులాబీ నీరు కలిపి ముఖానికి పూతలా వేసుకుని 10 నిమిషాల తరువాత కడుక్కుంటే ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది.
 
చందనం ముఖంపై ఉండే ముడతలను తగ్గించడమే కాకుండా చర్మాన్ని బిగుతుగా మార్చుతుంది. రెండు చెంచాల పెరుగులో కాస్త చందనం పొడి కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అది పూర్తిగా ఆరాక కడిగేసుకుంటే జిడ్డు చర్మం కాస్త మృదువుగా మారుతుంది. రెండు చెంచాల ముల్తానీమట్టిలో కొద్దిగా అరటిపండు గుజ్జు, మూడు చంచాల చందనం కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి.
 
20 నిమిషాల తరువాత కడిగేస్తే నలుపుదనం దగ్గడమే కాకుండా మెుటిమల సమస్యల నుండి విముక్తి చెందవచ్చును. చందనంతో పూత వేసుకునే ముందుగా ముఖాన్ని చల్లని నీటితో కడుక్కుని రాసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును.