గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 2 జులై 2018 (09:32 IST)

రాత్రిపూట ఆకుకూరలు, పెరుగు తీసుకోకూడదా? ఎందుకు?

ఆయుర్వేదం ప్రకారం కరివేపాకు, జీలకర్ర, మెంతులతో తలనొప్పిని పోగొట్టుకోవచ్చు. ఆహారంలో మార్పులు తలనొప్పికి కారణమవుతాయి. అలాగే ఒన్‌సైడ్ తలనొప్పిని భరించడం చాలా కష్టం. దీనితో తల తిరగడం, వాంతులు కావడం జరుగుత

ఆయుర్వేదం ప్రకారం కరివేపాకు, జీలకర్ర, మెంతులతో తలనొప్పిని పోగొట్టుకోవచ్చు. ఆహారంలో మార్పులు తలనొప్పికి కారణమవుతాయి. అలాగే ఒన్‌సైడ్ తలనొప్పిని భరించడం చాలా కష్టం. దీనితో తల తిరగడం, వాంతులు కావడం జరుగుతుంటాయి. 
 
తలనొప్పి ఏర్పడడానికి ఆహారాన్ని సరైన సమయానికి తీసుకోకపోవడం కూడా ప్రధాన కారణమే. కంటి నిండా నిద్రతో పాటు జీర్ణంకాని ఆహారపదార్థాల జోలికి వెళ్లకుండా ఉండడం ద్వారా తలనొప్పిని దూరం చేసుకోవచ్చును. రాత్రిపూట ఆకుకూరలు, పెరుగు వంటివి తీసుకోకూడదు. వీటిని తీసుకుంటే అజీర్తితో తలనొప్పి వచ్చే ప్రమాదముంది. 
 
వేపిన మెంతుల పొడిని అరస్పూన్ తీసుకుని అరగ్లాస్ నీటిలో వేసి బాగా మరగనివ్వాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత 48 రోజుల పాటు దీనిని త్రాగితే తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. మెంతుల్లోని పీచు, ఐరన్ తలనొప్పికి కారణమయ్యే రుగ్మతలను దూరం చేస్తుంది. 
 
జీలకర్ర, ఎండిన ఉసిరికాయను బాగా నీటిలో మరగనిచ్చి తీసుకుంటే తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చును. కరివేపాకు పొడి, ఖర్జూరం, తేనె మూడింటిని పేస్టులా చేసుకుని రోజూ ఒక స్పూన్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది.