సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Updated : శనివారం, 30 జూన్ 2018 (22:37 IST)

జూలై నెల రాశి ఫలితాలు... 27న చంద్రగ్రహణం, ఆ నక్షత్రాల వారు జాగ్రత్త(Video)

4వ తేదీ శుక్రుడు సింహం నందు, 16వ తేదీ రవి కర్కాటం ప్రవేశం. 10వ తేదీ గురువు వక్రత్యాగం. 26వ తేదీ బుధునికి వక్రం ప్రారంభం. 1వ తేదీ సంకటహర చతుర్థి, 9వ తేదీ సర్వ ఏకాదశి, 11వ తేదీ మాసశివరాత్రి, 27వ తేదీ గు

4వ తేదీ శుక్రుడు సింహం నందు, 16వ తేదీ రవి కర్కాటం ప్రవేశం. 10వ తేదీ గురువు వక్రత్యాగం. 26వ తేదీ బుధునికి వక్రం ప్రారంభం. 1వ తేదీ సంకటహర చతుర్థి, 9వ తేదీ సర్వ ఏకాదశి, 11వ తేదీ మాసశివరాత్రి, 27వ తేదీ గురుపూర్ణిమ, చంద్రగ్రహణం. ఈ గ్రహణం ఉత్తరాషాఢ, శ్రవణా నక్షత్రాల మీద ఏర్పడటం వల్ల ఈ నక్షత్రాల వారు గ్రహణం వీక్షించకుండా ఉండడం మంచిది. 31వ తేదీ సంకటహర చతుర్థి.
 
మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
గృహమార్పు కలిసివస్తుంది. ఆత్మీయులుతో సంప్రదింపులు జరుపుతారు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతానం ఉన్నత చదువులపై శ్రద్ధ వహిస్తారు. ప్రకటనలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అపరిచితులతో జాగ్రత్త. వ్యవహారానుకూలత ఉంది. ఆదాయ వ్యయాలు పర్వాలేదనిపిస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. రుణబాధలు తొలగుపోతాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరణకు అనుకూలం. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో చికాకులు తప్పవు. 
 
వృషభరాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు విపరీతం. పొదుపు ఆలోచన ఫలించదు. బంధువులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమెుత్తం ధనసహాయం తగదు. దంపతులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడుతాయి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. అనుకోని సంఘటనలెదురవుతాయి. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటి వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారులకు ధనప్రలోభం తగదు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. దైవదర్శనం సంతృప్తినిస్తుంది. 
 
మిధునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఈ మాసం అనుకూలదాయకమే. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు ప్రయోజనకరం. వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి. అనవసర జోక్యం తగదు. ఆరోగ్యం సంతృప్తికరం. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పదవీయోగం. పురస్కారాలు అందుకుంటారు. పెట్టుబడులకు తరుణం కాదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సరుకు నిల్వతో జాగ్రత్త. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. న్యాయ, సేవా, సాంకేతిక రంగాలవారికి ఆశాజనకం. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు. 
 
కర్కాటకరాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. గృహమార్పు కలిసివస్తుంది. వ్యవహార దక్షతతో రాణిస్తారు. కష్టానికి ప్రతిఫలం అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడుతాయి. వేడుకులకు సన్నాహాలు సాగిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన కలుగుతుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
సింహరాశి: మఖు, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సంతానానికి విదేశీ విద్యావకాశం లభించకపోవచ్చు. ఆర్థికస్థితి సామాన్యం. ఇతరులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. పరిస్థితులు అనుకూలించవు. ఆత్మీయుల హితవు మీ పై మంచి ప్రభావం చూపుతుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. గృహమార్పు నిదానంగా ఫిలతమిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు పనిభారం. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కన్యరాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సంప్రదింపులు, ఒప్పందాలకు అనుకూలం. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. వ్యవహారాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికలావాదేవీలు పురోగతిన సాగుతాయి. మీ వైఖరిలో మార్పు వస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. అవసరాలకు ధనం అందుతుంది. ఊహించని సంఘటనలెదురవుతాయి. ప్రముఖుల సహకారం అందుతుంది. మానసికంగా కుదుటపడుతారు. పెట్టుబడులకు తరుణం కాదు. ఉద్యోగస్తులకు పదవీయోగం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. త్వరలోనే మీ కృషి ఫలిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వైద్య, న్యాయ, సాంకేతిక రంగాలవారికి ఆశాజనకం.
 
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థికస్థితి మెరుగుపడుతుంది. రుణ విముక్తులవుతారు. ఖర్చులు ప్రయోజనకరం. గృహమార్పు కలిసివస్తుంది. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పనులు సానుకూలమవుతాయి. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. స్థిరాస్తి క్రయవిక్రయంలో పునరాలోచన మంచిది. పెద్దల సలహా పాటించండి. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. వేడుకల్లో పాల్గొంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. నిర్మాణాలు, మరమ్మత్తులు చేపడతారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదామార్పు, స్థానచలనం.
 
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
ఈ మాసం శుభాశుభ మిశ్రమ సమ్మేళనం. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం తక్కువ. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. సమర్ధతకు ఏమంత గుర్తింపు ఉండదు. అవకాశాలు చేజారిపోతాయి. యత్నాలను విరమించుకోవద్దు. ఒక సమాచారం ఉత్సాహానిస్తుంది. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. సంతానానికి విదేశీ విద్యావకాశం లభించకపోవచ్చు. పదువులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
 
ధనర్‌రాశి: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. పదువుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆర్థికస్థితి మెరుగుపడుతుంది. మెుండి బాకీలు వసూలవుతాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పరిస్థితుల అనుకూలత ఉంది. పనులు వేగవంతమవుతాయి. కుటుంబ విషయాలు వెల్లడించవద్దు. దంపతుల మధ్య దాపరికం తగదు. అవివాహితుల ఆలోచనలు పలువిధాలుగా ఉంటాయి. సంస్థల స్థాపనలకు సమయం కాదు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవసరం. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. ఆశ్చర్యకరమైన సంఘటనలెదురవుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ మాసం అనుకూలదాయకం. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. పురస్కారాలు అందుకుంటారు. తొందరపడి హామీలివ్వవద్దు. ఖర్చులు విపరీతం. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పరిచయం లేని వారితో జాగ్రత్త. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. శుభకార్యం నిశ్చయమవుతుంది. వివాహ వేదికలు అన్వేషిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. మీ ప్రమేయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఆస్తి, స్థల వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. వృత్తుల వారికి సామాన్యం. ప్రయాణంలో జాగ్రత్త. విదేశీ విద్యాయత్నం ఫలించదు.
 
కుంభరాశి: ధనిష్ట 2, 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారానుకూలతకు మరింత శ్రమించాలి. మీపై శకునాల ప్రభావం అధికం. సన్నిహితుల కలయికతో కుదుటపడుతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. యత్నాలు ఫలించవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. నగదు, పత్రాలు జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెట్టుబడులకు అనుకూలం కాదు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. దైవకార్యంలో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు విచారణకు వచ్చే సూచనలున్నాయి.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఈ మాసం యోగదాయకం. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ధనలాభం ఉంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. వస్తు నాణ్యతను గమనించండి. రశీదులు, నగదు జాగ్రత్త. పనులు సానుకూలమవుతాయి. నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త పరిచయాలేర్పడతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం, వాహన యోగం పొందుతారు. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.