గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : గురువారం, 28 జూన్ 2018 (09:16 IST)

28-06-2018 - గురువారం మీ రాశి ఫలితాలు.. మిమ్మల్ని పొగిడే వారే కానీ..?

మేషం: ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపడతారు. నిరుద్యోగయత్నాలు కలిసిరాగలవు. తరుచు దైవ, సేవా కార్యల్లో పాల్గొంటారు. బంధువుల నుండి ఒత్తిళ్లు, మెుహ్మమాటాలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రేమికులకు సన్నిహితుల నుండ

మేషం: ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపడతారు. నిరుద్యోగయత్నాలు కలిసిరాగలవు. తరుచు దైవ, సేవా కార్యల్లో పాల్గొంటారు. బంధువుల నుండి ఒత్తిళ్లు, మెుహ్మమాటాలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రేమికులకు సన్నిహితుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. కలపం, ఐరన్, ఇసుక వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది.
 
వృషభం: లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన అవసరం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. రిప్రజెంటేటివ్‌లు, ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు క్లయింట్‌లతో చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. దూరప్రయాణాలలో ఇబ్బందులు తప్పవు.
 
మిధునం: కుటుంబ అవసరాలు, ఖర్చులు పెరిగే ఆస్కారం ఉంది. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురువుతారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. 
 
కర్కాటకం: స్త్రీల ఆరగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాలవారికి ఒత్తిడి అధికమవుతుంది. ప్రభుత్వ కార్యాయాల్లో పనులు అనుకూలిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు.
 
సింహం: రాజకీయాలలో వారు తొందరపడి వాగ్థానాలు చేయడం వలన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసికి ప్రశాంతత చేకూరుతుంది. ఏదైనా స్థిరాస్తి అమ్మకానికై చేయు యత్నం వాయిదా పడడం మంచిది. మీ శ్రీమతి సలహా పాటించడం వలన మేలే జరుగుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
కన్య: అసలైన శక్తి సామర్థ్యాన్ని మిమ్మల్ని పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. సన్మానాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయనాయకులు కొంత సంక్షోభం ఎదుర్కుంటారు. తలచిన కార్యక్రమాలు, వ్యవహారాలు సజావుగా సాగుతాయి. దంపతుల మధ్య సంతానం విద్యావిషయాలు ప్రస్తావనకు వస్తాయి. 
 
తుల: బ్యాంకు పనుల్లో ఆలస్యం ఆందోళన కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళకువ అవసరం. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ సంతానం మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
వృశ్చికం: హోటల్, కేటరింగ్ రంగాల్లోవారికి పనివారిలతో ఇబ్బందులు ఎదుర్కుంటారు. ధనసహాయం, ఆదాయ వ్యయాల్లో ఏకాగ్రత వహించండి. రచయితలు, కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. 
 
ధనస్సు: మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. కొబ్బరి, పండ్ల, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకం. స్వయంకృషితో బాగుగా అభివృద్ధి చెందుతారు. స్త్రీలు అందరి యందు కలుపుగోలు తనంగా వ్యవహరించడం వలన సమస్యలు తలెత్తుతాయి.
 
మకరం: మీ ధైర్యసాహసాలకు, కార్యదీక్షకు మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుంది. చేపట్టిన పనులు విసుగు కలిగించినా మెుండిగా పూర్తిచేస్తారు. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు. దైవారాధన పట్ల ఆశక్తి పెరుగుతుంది. సోదరీసోదరుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటు చేసుకుంటాయి.
 
కుంభం: సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలకమైన వ్యవహారాల్లో కుటుంబీకుల సలహా పాటించడం మంచిది. దంపతుల మధ్య సఖ్యత, కుటుంబంలో ప్రశాంతత నెలకుంటుంది. మిమ్ములను వ్యతిరేకించిన వారిని సైతం మీ వైపునకు తిప్పుకో గల్గుతారు. పాత వస్తులను కొని ఇబ్బందులను ఎదుర్కుంటారు. 
 
మీనం: ఆర్థికంగా పురోగమించటానికి మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. చేపట్టిన పనులలో చిన్న చిన్న పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీఊహలు నిజమవుతాయి. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన మరికొంత కాలం వాయిదా వేయడం మంచిది.