గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : మంగళవారం, 26 జూన్ 2018 (09:27 IST)

మంగళవారం (26-06-18) - మిత్రులతో కలిసి విందు.. వినోదాల్లో...

మేషం: ఉద్యోగస్తులు అధికారులను తక్కువ అంచనా వేయడం వల్ల ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. విదేశీ వస్తువుల పట్ల ఆశక్తి పెరుగుతుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి కలిసివచ్చే కాలం. ఎన్ని అవాంతరాలు ఎద

మేషం: ఉద్యోగస్తులు అధికారులను తక్కువ అంచనా వేయడం వల్ల ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. విదేశీ వస్తువుల పట్ల ఆశక్తి పెరుగుతుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి కలిసివచ్చే కాలం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆత్మదైర్యంతో అడుగు ముందుకేయండి. ఎదుటివారితో ముక్తసూటిగా సంభాషిస్తారు.
 
వృషభం: స్త్రీలకు మోకాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన సమస్యలు అధికమవుతాయి. ఎంత కష్టమైన పనైనా అవలీలగా పూర్తిచేస్తారు. సోదరీసోదరుల కలయిక, పరస్పర అవగాహన కుదరదు. సమయానికి కావలసిన వస్తువులు కనిపించకపోవచ్చు. మిత్రులతో కలిసి విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు.
 
మిధునం: ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. విద్యార్ధినులకు టెక్నికల్, సైన్సు కోర్సులలో అవకాశాలు లభిస్తాయి. రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టంమ్మీద పూర్తిచేస్తారు. పొదుపు పథకాలు, స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి. మీ కళత్ర మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
కర్కాటకం: హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారలతో ఇబ్బందులు ఎదుర్కుంటారరు. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. స్త్రీలకు తల, నరాలు, దంతాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. 
 
సింహం: వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. రవాణా రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఏమరుపాటు, అశ్రద్ధకూడదు. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభించగలవు. బ్యాంకు వ్యవహారాలు అనుకూలిస్తాయి. దూరప్రయాణాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. 
 
కన్య: ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. ఊహించని విజయం మిమ్మల్ని విజయంతో ముంచెత్తుతుంది. చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వలన అస్వస్థతకు లోనవుతారు. 
 
తుల: ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. ప్రముఖులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వలన మీ కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. బంధుమిత్రులతో ప్రయాణాలు సాగిస్తారు. స్త్రీల తొందరపాటు తనం వల్ల బంధువర్గాల నుండి మాటపడవలసి వస్తుంది. 
 
వృశ్చికం: ఆర్థిక సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారలతో ఇబ్బందులు ఎదుర్కుంటారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కుంటారు. ధనవ్యయం, శ్రమాధిక్యతతో వ్యవహారాలు సానుకూలమవుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా మెలగవలసి ఉంటుంది.
 
ధనస్సు: ఆదాయానికి తగినట్లుగా వ్యయం చేస్తారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ప్రతి చిన్న చిన్న విషయాలకు ఇతరులపై ఆధారపడడం మంచిది కాదు. బంధుమిత్రుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. 
 
మకరం: ఉపాధ్యాయులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పిత్రార్జిత ఆస్తిని అమ్మటానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనాన్ని మంచి నీళ్ళప్రాయంగా ఖర్చు చేస్తారు. ఉన్నట్టుంది. వేదాంత ధోరణి కానవస్తుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. రాజకీయ నాయకులు సభసమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. 
 
కుంభం: ఆర్థిక విషయాల్లో ఊహించని మార్పు కానవస్తుంది. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. సభలు, సమావేశాలు, వేడుకల్లో చురుకుగా వ్యవహరిస్తారు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి.  
 
మీనం: కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది.