దుబాయ్ పైన ఇరాన్ డ్రోన్, చెవులు చిల్లులు, కదిలిపోయిన భవనాలు
ఇరాన్ పైన యుద్ధం చేయాలన్న ట్రంప్ నిర్ణయం బూంరాంగ్ అవుతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చిటికెలో చిదిమేస్తా అని ట్రంప్ చెప్పినప్పటికీ ఇరాన్ మాత్రం ఎంతమాత్రం వెనకడుగు వేయడంలేదు. గురువారం అమెరికా మిత్రదేశాలపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. మరీ ముఖ్యంగా దుబాయ్‌లో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ధాటికి సమీపంలో వున్న భవనాలు కూడా కదిలిపోయాయి. దట్టమైన పొగ కమ్ముకుంది.
ఐతే ఈ పేలుడుపై దుబాయ్ అధికారులు x వేదికగా స్పందించారు. దుబాయ్ పైకి దూసుకువచ్చిన డ్రోన్ కూల్చడం వల్ల దాని శకలాలు పడ్డాయని తెలిపారు. మధ్య దుబాయ్‌లోని ఒక భవనం ముఖభాగంపై అవి పడటంతో స్వల్పంగా దెబ్బతిన్నదని ధృవీకరించారు. ఎవరికీ ఎటువంటి గాయాలూ సంభవించలేదని వెల్లడించింది.
ఖమేనీ కుమారుడి కాలేయం చెడిపోయింది, కాలు తీసేసారు
ఇరాన్ నూతన సుప్రీం లీడర్, ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై అనేక వార్తలు వస్తున్నాయి. మొజ్తబాపై యూఎస్-ఇజ్రాయెల్ సేనలు మెరుపుదాడి చేసాయనీ, దాంతో అతడు తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లిపోయాడని కథనాలు వస్తున్నాయి. మొజ్తబాతో కాలేయం డ్యామేజ్ అయ్యిందనీ, అతడి కుడి కాలు తొలగించేసారని చెబుతున్నారు. తీవ్ర గాయాల కారణంగా అతడు కోమాలోకి వెళ్లిపోయాడని అంటున్నారు.
ఇటీవలే మొజ్తాబా మీడియా ముందుకు వస్తాడని ఇరాన్ అధికారులు ప్రకటించినప్పటికీ అతడు రాలేదు. ఖమేనీ మొజ్తాబా చెప్పినట్లు ఓ సందేశాన్ని యాంకర్ చదివింది. అంతేతప్ప అతడు ప్రత్యక్షంగా కనబడలేదు. దీనితో అతడి ఆరోగ్యంపై మరింత అనుమానం బలపడింది.
ఇదిలావుంటే... నూతన నాయకుడిగా మొజ్తాబా ఖమేనీ ఎన్నికయ్యాడని చెప్పిన రోజునే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేసారు. అతడు కూడా సంతోషంగా జీవించలేడనీ, ఎక్కువకాలం బతికి వుంటాడన్న నమ్మకం తనకు లేదని కూడా అన్నారు. దీనితో ప్రస్తుతం ప్రచారం అవుతున్న వార్తలు వాస్తవమనే నమ్మకాలు బలపడుతున్నాయి.

