శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 2 జులై 2018 (18:03 IST)

ముఖం జిడ్డుగా ఉందా? ఈ చిట్కాలు పాటిస్తే.....

అరకప్పు ద్రాక్షపండ్ల గుజ్జులో చిటికెడు నిమ్మరసం, స్పూన్ యాపిల్‌గుజ్జు, గుడ్డులోని తెల్లసొన వేసి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ ప్

అరకప్పు ద్రాక్షపండ్ల గుజ్జులో చిటికెడు నిమ్మరసం, స్పూన్ యాపిల్‌గుజ్జు, గుడ్డులోని తెల్లసొన వేసి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌ జిడ్డుచర్మానికి బాగా పనిచేస్తుంది.


అలాగే ఒక కప్పులో టమోటా గుజ్జు, కీరదోస గుజ్జు, ఓట్‌మీల్‌ పొడి, పుదీనా రసం తీసుకుని బాగా కలుపుకుని ముఖానికి రాసుకుంటే 10 నిమిషాల తరువాత కడుక్కుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. ఇలా చేయడం చర్మంపై ఉండే జిడ్డు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.
 
ఒక స్పూన్ తేనెకు గుడ్డులోని తెల్లసొన, గ్లిజరిన్‌, కొద్దిగా శెనగపిండి చేర్చి బాగా కలుపుకోవాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి 10 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. అలాగే గుడ్డులోని తెల్లసొనను విడిగా ముఖానికి పట్టించి ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే వదులైన చర్మం గట్టిపడి, మృదువుగా మారుతుంది.
 
అరకప్పు పుల్లటి పెరుగును చర్మానికి రాసుకుని మర్దనా చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత వేడినీటితో కడిగేయాలి. ఇలా చేస్తే ముఖం కోల్పోయిన తేమను తిరిగి పొందుతారు. తేనె రాసుకోవడం వలన కూడా చర్మం మృదువుగా మారుతుంది.