1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 29 జూన్ 2018 (15:53 IST)

పాదాలు ఆకర్షణీయంగా మారాలంటే?

పాదాలు అందంగా ఆకర్షణీయంగా మారాలంటే అరటిపండును ముద్దగా చేసి పగుళ్లపై రాసుకుని 10 నిమిషాల తరువాత నీటితో శుభ్రపరచుకుంటే మడమలు మెత్తబడతాయి. ఆపై గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం వేసి అందులో పాదాలను ఉంచాలి. 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడుక్కుంటే పగుళ

పాదాలు అందంగా ఆకర్షణీయంగా మారాలంటే అరటిపండును ముద్దగా చేసి పగుళ్లపై రాసుకుని 10 నిమిషాల తరువాత నీటితో శుభ్రపరచుకుంటే మడమలు మెత్తబడతాయి. ఆపై గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం వేసి అందులో పాదాలను ఉంచాలి. 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడుక్కుంటే పగుళ్ల వలన కలిగే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.

 
 
ప్రతిరోజు సాయంత్రం రోజ్‌వాటర్‌ను కాళ్ల పగుళ్లపై రాసి మృదువుగా మర్దనా చేసినా మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే నిమ్మరసంలో వ్యాజ్‌లైన్ వేసి గోరువెచ్చని సబ్బు ద్రావణంలో పాదాలను పెట్టాలి. ఆ తరువాత పొడి వస్త్రంతో పాదాలను తుడిచి నాణ్యమైన మాయిశ్చరైజర్‌ను రాయాలి. ఉదయాన్నే ఆవనూనెతో కాళ్లను మర్దనా చేసుకుంటే పగుళ్లు మెత్తబడి కొద్దిరోజులకే తగ్గిపోయే అవకాశం ఉంది.