శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : గురువారం, 28 జూన్ 2018 (09:42 IST)

మోచేతులు నలుపుగా ఉన్నాయా? వీటిని పాటిస్తే?

మోచేతులు మృదువుగా, కోమలంగా ఉండేందుకు ఈ చిట్కాలు మీ కోసం. మృతకణాలు ఎక్కువగా పేరుకుపోవడం వలన చర్మం నల్లగా మారుతుంది. ఆ సమస్య నుండి బయటపడాలంటే చెంచా తేనెలో చక్కెర, కాస్త నిమ్మరసం కలిపి మోచేతులకు రాసుకుని

మోచేతులు మృదువుగా, కోమలంగా ఉండేందుకు ఈ చిట్కాలు మీ కోసం. మృతకణాలు ఎక్కువగా పేరుకుపోవడం వలన చర్మం నల్లగా మారుతుంది. ఆ సమస్య నుండి బయటపడాలంటే చెంచా తేనెలో చక్కెర, కాస్త నిమ్మరసం కలిపి మోచేతులకు రాసుకుని మర్దన చేయాలి. ఇలా తరచూగా చేయడం వలన మృతుకణాలు తొలగిపోయి, నలుపుదనం కూడా తగ్గుతుంది.
 
నిమ్మరసంలో సహజ బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. నిమ్మకాయను సగానికి కోసి చక్కెరలో అద్ది మోచేతులపై రుద్దాలి. కాసేపయ్యాక చల్లటి నీళ్లతో కడిగి తేనెతో సున్నితంగా మర్దన చేయాలి. ఇలా చేయడం వలన మోచేతులు అందంగా మారుతాయి. తేనె చర్మానికి మాయిశ్చరైజింగ్ గుణాలను అందించి నలుపును తగ్గిస్తుంది. 
 
రెండు బంగాళాదుంపల్ని గుజ్జుగా చేసి అందులో తేనెను కాస్త కలుపుకుని ఆ మిశ్రమాన్ని మోచేతులకు పూతలా రాయాలి. కాసేపయ్యాక మర్దన చేసి కడిగేస్తే చర్మం చక్కగా నిగారింపును సంతరించుకుంటుంది. సెనగపిండిలో పెరుగు, పాలను కలుపుకుని మోచేతులకు రాసుకుంటే నల్లటి మచ్చలు తొలగిపోతాయి.