మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 26 జూన్ 2018 (11:16 IST)

వారానికి ఒకసారి పసుపు వేసిన నీటిని త్రాగితే?

పసుపు ఎన్నో ఔషధాల్లో ఉపయోగిస్తుంటారు. పసుపును ఆహార పదార్థాలోనూ వాడుతుంటాం. పసుపుకు సంబంధించిన కొన్ని ఉపయోగాలు తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం స్నానం చేయటానికి అరగంట ముందుగా పసుపు ఒంటికి బాగా పట్టించి స్న

పసుపు ఎన్నో ఔషధాల్లో ఉపయోగిస్తుంటారు. పసుపును ఆహార పదార్థాలోనూ వాడుతుంటాం. పసుపుకు సంబంధించిన కొన్ని ఉపయోగాలు తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం స్నానం చేయటానికి అరగంట ముందుగా పసుపు ఒంటికి బాగా పట్టించి స్నానం చేస్తే ఆరోగ్యంతో పాటు శరీర లావణ్యం కూడా సహాయపడుతుంది.
 
ఎక్కువసేపు నీటిలో ఉంటే పాదాలు నాని పగుళ్లు, ఒరుసుకుపోవడం లాంటివి జరుగుతుంటాయి. అలాంటప్పుడు పసుపు రాసుకుంటే యాంటీ సెప్టిక్‌గా పనిచేసి పాదాలకు ఉపశమనం కలిగిస్తుంది. పసుపు నీటిని వారానికి ఒకసారి త్రాగడం వలన శరీరంలో ఉన్న వేడిని తగ్గించడంలో మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా శరీర రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
 
ఆముదంలో కొద్దిగా పసుపు కలుపుకుని శరీరానికి రాసుకుని 10 నిమిషాల తరువాత సబ్బుతో రుద్దుకుని స్నానం చేయాలి. ఇలా చేయడం వలన శరీరంపై ఉన్న మచ్చలు, దురద, చర్మవ్యాధులు అన్ని తొలగిపోతాయి. శరీరం మీద ఏర్పడే దురదలతో బాధపడేవారు పసుపు, వేపాకును నూరి ఒంటికి పట్టిస్తే దురదలు తగ్గిపోతాయి.