బుధవారం, 1 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 26 జూన్ 2018 (10:37 IST)

పండని మామిడి కాయను తింటే ప్రయోజనం ఏమిటో తెలుసా?

పూర్తిగా పండని మామిడి పండును తినడం వలన శరీరంలో కొత్త కణాలు పుట్టుకొస్తాయి. ఇందులోని విటమిన్ సి ఆహారంలోని ఐరన్‌ను గ్రహించే శక్తిని పెరిగేలా చేస్తుంది. టీ.బీ, రక్తహీనత, కలరా, రక్త విరేచనాలు రాకుండా శరీర

పూర్తిగా పండని మామిడి పండును తినడం వలన శరీరంలో కొత్త కణాలు పుట్టుకొస్తాయి. ఇందులోని విటమిన్ సి ఆహారంలోని ఐరన్‌ను గ్రహించే శక్తిని పెరిగేలా చేస్తుంది. టీ.బీ, రక్తహీనత, కలరా, రక్త విరేచనాలు రాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే స్కర్వీ వ్యాధిని నిరోధించటంలో కూడా పూర్తిగా పండని మామిడి పండు శక్తివంతంగా పనిచేస్తుంది. 
 
 
 
మామిడి ఆకులను నీటిలో నానబెట్టి ఆ నీటిని ప్రతిరోజు త్రాగడం వలన డయాబెటిస్ వ్యాధిని అరకట్టవచ్చును. స్త్రీలకు సంబంధించిన అనేక సమస్యలకు కూడా ఈ ఆకులు తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. 
 
పోషకాహార లోపంతో బాధపడే చిన్నారుల్లో వచ్చే రేచీకటిని కూడా మామిడి పండు నిరోధిస్తుంది. అలాగే కంట్లోని ఇతర సమస్యలకు కూడా ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. బాగా పండిన మామిడి పండులో విటమిన్ ఏ పుష్కలంగా లబిస్తుంది. దీనివలన జలుబు, సైనసైటిస్ తదితర సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.