1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
  4. How to make the vibhuti? And its religion news?

విబూదిని ధరిస్తే ప్రయోజనం మేంటి?

విబూది అంటే పవిత్ర భస్మం. ఇది ఐశ్వర్యకారకం. పాపాలను నశింపచేస్తుంది. చెట్టు కాలినా చివరికి మిగలేది మాత్రం భస్మమే. అయితే ఏ బూడిద అయినా విబూదేనా అంటే కానే కాదని చెప్పాలి. సాధారణంగా గోమయ భస్మాన్నే విబూదిగా చెప్తారు. ఆవు పేడను సేకరించి పిడకలు లేదా ఉండలుగా

cow
విబూది అంటే పవిత్ర భస్మం. ఇది ఐశ్వర్యకారకం. పాపాలను నశింపచేస్తుంది. చెట్టు కాలినా చివరికి మిగలేది మాత్రం భస్మమే. అయితే ఏ బూడిద అయినా విబూదేనా అంటే కానే కాదని చెప్పాలి. సాధారణంగా గోమయ భస్మాన్నే విబూదిగా చెప్తారు. ఆవు పేడను సేకరించి పిడకలు లేదా ఉండలుగా చేసి వాటిని ఆరబెడతారు. ఆ పేడలో దాదాపు 16 రకాల ఔషధగుణాలున్నాయి.
 
ఈ పిడకల్ని ధాన్యపు పొట్టులోకానీ గడ్డితో కానీ అరలు అరలుగా పేర్చి మాసశివరాత్రి రోజున వేదమంత్రోఛ్ఛారణ మధ్య కాల్చుతారు. ఈ పద్ధతిని విరజహోమం అంటారు. కాలాక వాటిని తడిపి ఆరబెడతారు. దీన్ని దిమ్మలుగా చేసి విబూదిపండ్లుగా భక్తులకు అందజేస్తారు. విబూదిని ఎక్కువగా తమిళనాడు, కర్ణాటకాల్లోని ఆలయాల్లో ఉపయోగిస్తుంటారు. విబూదిని గుడుల్లో అనుసంధానమై ఉండే గోశాలల్లో తయారుచేస్తుంటారు.
 
అలాగే రకరకాల ఔషధ మెుక్కల్ని ఉపయోగించే హోమాల నుండి కూడా విబూదిని తయారుచేస్తారు. హోమ భస్మంలో ఆవుపేడతో పాటు 108 మూలికలు, సుగంధద్రవ్యాలు, ఆవు నెయ్యి ఉంటాయి. ఇవి అహాన్ని, కోరికలను అగ్నికి ఆహుతి చేశామన్న దానికి గుర్తుగా సాధువులు ధరిస్తుంటారు. విబూదిని ధరిస్తే అందులోని ఔషధ గుణాలు శరీరానికి చాలా మంచిది.
 
పద్ధతి ప్రకారం ఉంగరపు వేలు, బొటనవేళ్లతో విబూదిని తీసుకుని కనుబొమల మధ్య, గొంతుమీద, ఛాతిమీద ఎక్కువగా ధరిస్తారు. విబూది ధారణతో ఆధ్యాత్మిక భావన పెరగడంతో పాటు అనారోగ్యాల నుండి శరీరాన్ని కాపాటుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
సోమవారం (25-06-2018) దినఫలాలు - తొందరపడి నిర్ణయాలు..