అనులోమ విలోమ యోగాసనాలు వేస్తే....

ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్పిన సూక్తి. నాగరికత, సాంకేతిక అభివృద్ధి సాధించిన మానవుడు తన జీవితం సుఖమయమైయ్యేందుకు శారీరక శ్రమ తగ్గడమే కారణమని భావించారు. కాని ఆధునిక జీవన విధానం మనిషికి కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. దీంతో ఆరోగ్య సమస్యలు వి

Kowsalya| Last Updated: సోమవారం, 25 జూన్ 2018 (15:49 IST)
ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్పిన సూక్తి. నాగరికత, సాంకేతిక అభివృద్ధి సాధించిన మానవుడు తన జీవితం సుఖమయమైయ్యేందుకు శారీరక శ్రమ తగ్గడమే కారణమని భావించారు. కాని ఆధునిక జీవన విధానం మనిషికి కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. దీంతో ఆరోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
 
ఈ ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందాలంటే వ్యాయామం చేయాలంటున్నారు యోగా నిపుణులు. శరీరంలోని మలినాలను బయటకు పంపాలంటే మూల కారణమంటున్నారు. దీనికి విలోమ యోగాసనం చేయడం మంచిదని పరిశోధనలో వెల్లడైంది. 
 
పద్మాసనంలో కూర్చుని కుడి ముక్కు మూసుకుని ఎడమ ముక్కుతో గాలి పీల్చి వదలాలి. తరువాత రెండు ముక్కులు మూసుకుని కొద్దిసేపు పట్టుకోవాలి. ఆ తరువాత ఎడమ ముక్కు మూసుకుని కుడి ముక్కుతో శ్వాస పీల్చి వదలాలి. ఇలా చేయడం వలన శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. శ్వాస, బాగా జరిగి, నాడి వ్యవస్థలను మెరుగుపరుస్తుంది. దీనిపై మరింత చదవండి :