మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 3 జులై 2018 (15:38 IST)

ఆకుకూరలు ఉడికించేటప్పుడు ఇలా చేస్తే..?

బ్రెడ్ బజ్జీలు చేసేటప్పుడు బ్రెడ్ ముక్కలకు ఇరువైపులా పెరుగు రాసి.. పిండిలో ముంచి నూనెలో వేపాలి. ఇలా చేస్తే.. బ్రెడ్ ముక్కలు అధికంగా నూనెను పీల్చవు. పాయసంలో నీళ్లు ఎక్కువైతే శెనగల పిండిని కలిపితే సరిపో

బ్రెడ్ బజ్జీలు చేసేటప్పుడు బ్రెడ్ ముక్కలకు ఇరువైపులా పెరుగు రాసి.. పిండిలో ముంచి నూనెలో వేపాలి. ఇలా చేస్తే.. బ్రెడ్ ముక్కలు అధికంగా నూనెను పీల్చవు. పాయసంలో నీళ్లు ఎక్కువైతే శెనగల పిండిని కలిపితే సరిపోతుంది. పనీర్ ముక్కలకు కట్ చేసేందుకు ముందు కత్తిని మరిగిన నీటిలో కాసేపు వుంచి తీసి కట్ చేస్తే పనీర్‌ చక్కని షేప్‌లో వుంటాయి. 
 
ఇంట్లో చేసే పూరీలు హోటల్ పూరీల్లా వుండాలంటే.. గోధుమపిండిలో ఒక స్పూన్ సోయా పౌడర్, అర స్పూన్ పంచదార చేర్చుకోవాలి. ఇలా చేస్తే పూరీలు రుచిగా వుంటాయి. ఇడ్నీల కోసం ఉపయోగించే పొడిలో నూనె, నెయ్యికి బదులు పెరుగును చేర్చి తీసుకుంటే.. రుచిగా వుంటుంది. 
 
ఏ సూప్ చేస్తూ ఇంట్లో కార్న్ ఫ్లోర్ లేకపోతే.. ఒక స్పూన్ అటుకుల పొడిని చేర్చుకుంటే సరిపోతుంది. అటుకులను వేపుకుని పొడి చేసుకుని పెట్టుకుంటే.. కట్‌లెట్‌లకు బ్రెడ్ పొడికి బదులు, సూప్‌లో కార్న్ ఫ్లోర్‌కు బదులు వాడుకోవచ్చు. ఆకుకూరలను వుడికించేందుకు ముందు పంచదారను కలిపి వుడికిస్తే రంగు మారదు. రుచి అదిరిపోతుంది.