బుధవారం, 27 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 3 జులై 2018 (14:25 IST)

రెడ్‌వైన్‌ తాగుతున్నారా? అయితే మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు.....

రెడ్‌వైన్‌ను ఇష్టంగా తాగేవారు ఇకపై జాగ్రత్తగా ఉండాలి. వీలైతే దానిని తాగడం పూర్తిగా మానేయడమే ఆరోగ్యానికి మంచిది. అధిక మోతాదులో రెడ్‌వైన్ తీసుకోవడం వలన క్యాన్సర్, హృద్రగంతో పాటు డిప్రెషన్‌కు లోనయ్యే అవక

రెడ్‌వైన్‌ను ఇష్టంగా తాగేవారు ఇకపై జాగ్రత్తగా ఉండాలి. వీలైతే దానిని తాగడం పూర్తిగా మానేయడమే ఆరోగ్యానికి మంచిది. అధిక మోతాదులో రెడ్‌వైన్ తీసుకోవడం వలన క్యాన్సర్, హృద్రగంతో పాటు డిప్రెషన్‌కు లోనయ్యే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా శుద్ధిచేయని చక్కెర శాతం ఎక్కువగా ఉన్న ద్రాక్షారసం తాగడం వలన కాలేయం దెబ్బంతింటుంది.
 
ఈ పరిణామాల వలన శరీరంలోని చెడు కొవ్వు శాతం పెరుగుతుందని కూడా తెలియజేశారు. దీనిని తాగడం వలన దీర్ఘకాలిక వ్యాధులతో పాటు చర్మ సంబంధ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉండడం వలన మెుటిములు కూడా ఏర్పడే అవకాశముంది.
 
చర్మం కళను కోల్పోతుందని డాక్టర్ ఇసాబెల్ షార్కర్ తెలిపారు. రెడ్‌వైన్ తాగడం వలన కళ్లకింద నల్లటి వలయాలు కూడా ఏర్పడే ప్రమాదముంది. మెుటిమలు చర్మంపై గల మృతుకణాల వలన రంధ్రాలు ఏర్పడుతాయి గనుక సాధ్యమైనంతవరకు రెడ్‌వైన్‌ను తాగకపోవడమే మంచిదని పరిశోధనలో తెలియజేశారు.