మంగళవారం, 5 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 2 జులై 2018 (10:13 IST)

జాస్మిన్ ఆయిల్‌ను వాడితే.. ఎంత హాయి..

మల్లె పువ్వులు సువాసనను ఇచ్చే జాస్మిన్ ఆయిల్‌ను వాడితే ఎంతో హాయిగా వుంటుంది. మానసిక ఒత్తిడి ఇట్టే మాయమవుతుంది. మల్లెల నుంచి తీసిన నూనె ఆందోళనను తగ్గిస్తుంది. మల్లెల నూనె కేంద్ర నాడీ వ్యవస్థ సామర్థ్యాన

మల్లె పువ్వులు సువాసనను ఇచ్చే జాస్మిన్ ఆయిల్‌ను వాడితే ఎంతో హాయిగా వుంటుంది. మానసిక ఒత్తిడి ఇట్టే మాయమవుతుంది. మల్లెల నుంచి తీసిన నూనె ఆందోళనను తగ్గిస్తుంది. మల్లెల నూనె కేంద్ర నాడీ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచుతుంది. నిద్రలేమీ, ఆందోళనా, ఒత్తిళ్లను తగ్గించడానికి ఈ నూనెను వినియోగించుకోవచ్చు. మనస్సును ఆహ్వాదకరంగా మార్చే శక్తి ఈ ఆయిల్‌కు వుంది. 
 
అలాగే లావెండర్ ఆయిల్ మూడ్‌ను చిటికెలో మార్చేస్తుంది. ఈ పూల పరిమళం సాంత్వన కలిగిస్తుంది. నిద్రలేమీ, శ్వాసలో ఇబ్బందులను కూడా తగ్గిస్తుంది. తాజా, పుల్లటి రుచి కలిగిన నిమ్మతో తయారైన పరిమళం నూతన ఉత్తేజాన్ని పెంపొందిపజేస్తుంది. అలసట, బాధ, ఒత్తిడిగా ఉన్నప్పుడు ఈ నూనెను వాడితే మంచి ఫలితం వుంటుంది. పనులపై ఏకాగ్రతను పెంచుతుంది. 
 
మల్లెల రేకులతో తయారు చేసే టీ జీవక్రియను ప్రేరేపిస్తుంది, మెదడు పనిని ప్రేరేపిస్తుంది, మెదడు నాళాల గోడలను బలపరుస్తుంది. జాస్మిన్‌తో టీ, శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.