శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Kowsalya
Last Updated : శనివారం, 30 జూన్ 2018 (15:00 IST)

క్యాప్సికం రైస్ తయారీ విధానం....

క్యాప్సికంలో విటమిన్స్, క్యాల్షియం, మెగ్నిషియం, ప్రోటీన్స్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. క్యాప్సికం ఆరోగ్యానికి మంచి ఉపశమనం కలిగిస్తుంది. మరి ఇటువంటి క్యాప్సికంతో రైస్ ఎలా తయారుచేయాలో చూద్దాం.

క్యాప్సికంలో విటమిన్స్, క్యాల్షియం, మెగ్నిషియం, ప్రోటీన్స్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. క్యాప్సికం ఆరోగ్యానికి మంచి ఉపశమనం కలిగిస్తుంది. మరి ఇటువంటి క్యాప్సికంతో రైస్ ఎలా తయారుచేయాలో చూద్దాం. 
 
కావలసిన పదార్థాలు:
బియ్యం - ఒకటిన్నర కప్పు 
క్యాప్సికం - 2 
నూనె - సరిపడా 
టమోటా - 1 
ఉల్లిపాయ తరుగు - అరకప్పు 
పచ్చిమిర్చి - 4 
అల్లం వెల్లుల్లి పేస్టు - 1 స్పూన్
దనియాల పొడి - 1 స్పూన్
పసుపు - చిటికెడు
ఉప్పు - రుచికి తగినంత 
కారం - 1 స్పూన్
పనీర్‌ క్యూబ్స్‌ - 1 కప్పు 
కొత్తిమీర - అలంకరణకు
లవంగాలు - 4 
యాలకులు - 4
దాల్చిన చెక్క - అంగుళం ముక్క
షాజీరా - అర స్పూన్
 
తయారీ విధానం:
ముందుగా బియ్యం కడిగి పొడి పొడిగా అన్నం వండి చల్లారనివ్వాలి. బాణలిలో నూనెను పోసి అందులో మసాల దినుసులు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి తర్వాత ఒకటి బాగ వేగించాలి. ఆ తరువాత కారం, ఉప్పు, పసుపు, దనియాల పొడి కూడా వేగించి ఆ మిశ్రమంలో టమోటా పనీర్‌ ముక్కలు వేసి మూతపెట్టాలి. 2 నిమిషాల తరువాత ఆ మిశ్రమంలో క్యాప్సికం ముక్కలు వేసి కలుపుకోవాలి. క్యాప్సికం రంగు మారకుండానే అన్నం కలిపి స్టౌవ్‌పైన 4 నిమిషాలు పాటు అలానే ఉంచాలి. చివరగా కొత్తిమీరతో అలంకరించాలి. అంతే క్యాప్సికం రైస్ రెడీ.