శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 24 జూన్ 2018 (11:00 IST)

కూరగాయలు అమ్ముతున్న డేరా బాబా..

బాబా ముసుగులో మహిళలపై అత్యాచారానికి పాల్పడిన డేరా సచ్ఛ సౌధా అధిపతి, ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీం సింగ్‌కు కోర్టు 20 యేళ్ల జైలుశిక్ష పడిన విషయంతెల్సిందే. ప్రస్తుతం ఆయన హర్యానాలోని రోహ్‌తక్ జైల్

బాబా ముసుగులో మహిళలపై అత్యాచారానికి పాల్పడిన డేరా సచ్ఛ సౌధా అధిపతి, ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీం సింగ్‌కు కోర్టు 20 యేళ్ల జైలుశిక్ష పడిన విషయంతెల్సిందే. ప్రస్తుతం ఆయన హర్యానాలోని రోహ్‌తక్ జైల్‌లో శిక్షను అనుభవిస్తున్నాడు. జైలులో మనోడికి నో వీఐపీ ట్రీట్‌మెంట్. సాధారణ ఖైదీలాగానే మనోడిని కూడా జైలు అధికారులు ట్రీట్ చేస్తున్నారు.
 
అదేసమయంలో ఈయనగారికి జైలు అధికారులు పనికూడా కల్పించారు. అదే కూరగాయల పెంపకం. ఇందుకోసం 100 యార్డుల స్థలాన్ని కేటాయించారు. దాంట్లో గుర్మీత్.. తన కష్టార్జితంతో కూరగాయలు పండిస్తున్నాడు. ఇప్పటివరకు ఒకటిన్నర క్వింటాళ్ల ఆలుగడ్డలు, అలొవెరా, టమోటాలు, సోరకాయ, బీరకాయ వంటివి పండిస్తున్నాడు. ఇలా కూరగాయలు పండిస్తూ రోజుకు అక్షరాలా 20 రూపాయలు సంపాదిస్తున్నాడు. గుర్మీత్ పండించిన కూరగాయలను జైలులో ఉన్న ఖైదీల వంట కోసమే ఉపయోగిస్తుండటం గమనార్హం.