బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : సోమవారం, 18 జూన్ 2018 (19:43 IST)

చిన్న పిల్లలు కంటి జబ్బులతో బాధపడుతున్నారా...

చిన్నపిల్లలు మెుబైళ్లు, టీవీలు అధికంగా చూడటంతో దృష్టి లోపాలతో ఇబ్బంది పడుతుంటారు. పిల్లలు సరైన పోషకపదార్థాలు తీసుకోకపోవడం వలన చిన్న వయస్సులోనే కంటి జబ్బులు తప్పట్లేదు. కంటి జబ్బులు నుంచి దూరం చేసే శక్

చిన్నపిల్లలు మెుబైళ్లు, టీవీలు అధికంగా చూడటంతో దృష్టి లోపాలతో ఇబ్బంది పడుతుంటారు. పిల్లలు సరైన పోషకపదార్థాలు తీసుకోకపోవడం వలన చిన్న వయస్సులోనే కంటి జబ్బులు తప్పట్లేదు. కంటి జబ్బులు నుంచి దూరం చేసే శక్తి కాయగూరలు, పండ్లు తినడం వలన లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
జామ కంటికి ఎంతో సహాయపడుతుంది. దీంతో నల్లద్రాక్ష, కొత్తిమీర, మెంతికూరను ప్రతిరోజూ ఆహారంగా తీసుకుంటే దృష్టి లోపాలను నివారించవచ్చును.అందుకే పిల్లలు తీసుకునే ఆహారంలో బీన్స్, క్యారెట్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మునగ ఆకులు, అల్లం, గుమ్మడికాయ, సొరకాయ, పొట్లకాయ, మామిడి పండ్లు వంటివి చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
పిల్లలకు ఇలా రకరకాలుగా తిండి పెట్టడం వలన మీరు వారి కంటి జబ్బులను దూరం చేయవచ్చును. ఈ కూరగాయలు, పండ్లలో విటమిన్స్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అందుచేతనే అన్ని వ్యాధులకు వీటితో చెక్ పెట్టవచ్చును.