శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 13 జూన్ 2018 (15:21 IST)

రంగు రంగుల కూరలు.. కర్రీ పాయింట్స్ వద్దకు వెళ్తున్నారా?

కర్రీ పాయింట్స్.. ప్రస్తుతం హైదరాబాద్ వాసులకు ఇవేంటో బాగా తెలుసు. కర్రీ పాయింట్స్‌కు వెళ్ళి.. నచ్చిన కర్రీ తెచ్చుకుని వేడి వేడి అన్నం మాత్రం సిద్ధం చేసుకుని అందులో వేసుకుని లొట్టలేసుకుని తినేస్తుంటారు

కర్రీ పాయింట్స్.. ప్రస్తుతం హైదరాబాద్ వాసులకు ఇవేంటో బాగా తెలుసు. కర్రీ పాయింట్స్‌కు వెళ్ళి.. నచ్చిన కర్రీ తెచ్చుకుని వేడి వేడి అన్నం మాత్రం సిద్ధం చేసుకుని అందులో వేసుకుని లొట్టలేసుకుని తినేస్తుంటారు. అయితే కర్రీ పాయింట్స్‌లో నాసిరకం కూరగాయలను చేర్చుతున్నారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారానికో లేదా మాసానికి ఓసారి హోటళ్లలో భుజించడం ఓకే కానీ.. రోజూ షాపుల్లో వండే కూరలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలే వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
ఇందుకు కారణం.. మార్కెట్లలో లభించే చౌక కూరగాయలు, మిగిలిపోయిన మాంసాహారాన్ని డీప్ ఫ్రీజ్‌లో వుంచి మరుసటి రోజు కర్రీ పాయింట్స్ వారు వృధా కాకుండా అమ్మేయడం ద్వారా ఆరోగ్య ఇబ్బందులు తప్పవంటున్నారు. ఇంకా కర్రీల్లో ఉపయోగించే నీరు, కూరగాయల్లో నాణ్యత చాలామటుకు వుండదని.. ఇంకా వంటమనుషులు శుభ్రత పాటించరని.. వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
అంతేగాకుండా.. కర్రీ పాయింట్స్‌లో రంగుల రంగుల కూరలు కనిపిస్తాయి. ఇందుకు కారణం వాటిలో వుపయోగించే రంగులు. రంగులను అధికంగా వుపయోగించే కూరలను తీసుకోవడం ద్వారా క్యాన్సర్లు, మధుమేహానికి దారితీస్తాయి. ఇంకా కాలేయానికి ముప్పు తెస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.