మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (12:04 IST)

అతడు నాతో వ్యాపారం చేయాలనుకున్నాడు.. థ్యాంక్స్ విశాల్: అమలా పాల్‌

ఇద్దరమ్మాయిలతో హీరోయిన్ అమలా పాల్ పందెంకోడి విశాల్‌కు ధన్యవాదాలు తెలిపింది. తనపై లైంగిక వేధింపులు జరిగాయని ధైర్యంగా చెప్పిన అమలాపాల్‌‌ను విశాల్ కొనియాడాడు. అందుకు అమలా పాల్ స్పందిస్తూ.. లైంగిక వేధింపు

ఇద్దరమ్మాయిలతో హీరోయిన్ అమలా పాల్ పందెంకోడి విశాల్‌కు ధన్యవాదాలు తెలిపింది. తనపై లైంగిక వేధింపులు జరిగాయని ధైర్యంగా చెప్పిన అమలాపాల్‌‌ను విశాల్ కొనియాడాడు. అందుకు అమలా పాల్ స్పందిస్తూ.. లైంగిక వేధింపుల గురించి నిందితులకు తగిన శిక్ష పడేలా చేయడం ప్రతి మహిళ హక్కని.. అన్యాయాన్ని చూస్తూ వుండాల్సిన పనిలేదంటూ అమలాపాల్ చెప్పింది. 
 
ఇటీవల టీనగర్‌లోని నృత్య కళాశాలలో శిక్షణ తీసుకుంటూ వుంటే అళగేశన్ తనను లైంగికంగా వేధించాడని అమలా పాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కూడా గంటల్లో స్పందించి అళగేశన్‌ను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అమలాపాల్‌ను మెచ్చుకుంటూ పందెంకోడి విశాల్ ట్వీట్ చేశారు. ఇందుకు అమలా పాల్ ట్విట్టర్ ద్వారా స్పందించింది. 
 
తన తరపున మాట్లాడినందుకు ధన్యవాదాలు విశాల్ అంటూ అమలాపాల్ చెప్పింది. ఇది ప్రతి మహిళ బాధ్యతగా భావిస్తున్నా. వేధింపులపై మౌనం వహించడం సరికాదని తనకు తెలిసేలా చేశావు. ఆయన తనతో వ్యాపారం చేయాలనుకున్నాడని అమలా పాల్ ఆవేదన వ్యక్తం చేసింది. ఆయనుకున్న గుర్తింపు ఆయన చేసే పనులను చూసి చాలా భయపడిపోయానని అమలా పాల్ ట్విట్టర్లో తెలిపింది.