గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 17 జనవరి 2018 (17:37 IST)

రూ.20లక్షల పన్ను ఎగ్గొట్టిన అమలా పాల్: బెయిల్ మంజూరు చేసిన కోర్టు

అమలా పాల్ సినిమాల ద్వారా ఎంత పాపులారిటీ సంపాదించుకుందో వ్యక్తిగత విషయాలు, వివాదాలతోనూ అంతే గుర్తింపు సంపాదించుకుంది. తమిళ దర్శకుడు ఎఎల్.విజయ్‌తో ప్రేమాయణం, అతనిని వివాహం చేసుకోవడం, సంవత్సరం తిరిగేలోపు

అమలా పాల్ సినిమాల ద్వారా ఎంత పాపులారిటీ సంపాదించుకుందో వ్యక్తిగత విషయాలు, వివాదాలతోనూ అంతే గుర్తింపు సంపాదించుకుంది. తమిళ దర్శకుడు ఎఎల్.విజయ్‌తో ప్రేమాయణం, అతనిని వివాహం చేసుకోవడం, సంవత్సరం తిరిగేలోపు విడాకులు తీసుకోవడం ద్వారా అమలా పాల్ వార్తల్లోకెక్కింది. 
 
విడాకుల తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అమలాపాల్ త్వరలో రెండో పెళ్లి చేసుకుంటానని తాజాగా చెప్తోంది. మంచి అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకోవడానికి వెనుకాడనని పేర్కొంది. ఈ గ్యాప్‌లో సినిమాల్లో బాగా సంపాదించాలని అమలాపాల్ నిర్ణయించుకుంది. ఆఫర్లు కూడా ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. 
 
అయితే ఇటీవల అమలాపాల్ ఓ ఖరీదైన కారు కొని తప్పుడు పత్రాలు సమర్పించి రూ.20 లక్షల పన్ను ఎగ్గొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంది. దీంతో ఆమెపై కేరళలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె తిరువనంతపురంలోని క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయారు. ఇటీవల ఆమె బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా, తిరస్కరించిన కోర్టు, క్రైమ్‌ బ్రాంచ్‌ ఎదుట హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. 
 
ఈ నేపథ్యంలోనే అమలా పాల్ పోలీసుల ముందు లొంగిపోయింది. తాను ఎటువంటి తప్పు చేయలేదని గతంలో చెప్పుకున్న అమలా పాల్ పన్ను ఎగ్గొట్టిన మాట నిజమేనని పోలీసుల ముందు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల ఆమె ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా మొద‌ట పోలీస్ స్టేష‌న్‌లో లొంగిపోవాలని ఆమెను కోర్టు ఆదేశించింది. దీంతో ఆమె ఎట్టకేలకు పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోవడంతో కేరళ హైకోర్టు బుధవారం  రూ.లక్ష పూచీకత్తుతో ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది.