బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : శనివారం, 2 డిశెంబరు 2017 (13:52 IST)

అజిత్‌తో నటించే ఛాన్స్ వస్తే ఏమాత్రం వదులుకోను: అమలా పాల్

ప్రముఖ దర్శకుడు విజయ్‌ని ప్రేమించి వివాహం చేసుకుని ఆపై.. విడాకులతో వేరైన ఇద్దరమ్మాయిలతో హీరోయిన్ అమలాపాల్.. తాజాగా తిరుట్టుపయలే-2లో నటించింది. ఈ సినిమాలో అందాలను మోస్తరుగా ఆరబోసిన అమలాపాల్‌కు కోలీవుడ్

ప్రముఖ దర్శకుడు విజయ్‌ని ప్రేమించి వివాహం చేసుకుని ఆపై.. విడాకులతో వేరైన ఇద్దరమ్మాయిలతో హీరోయిన్ అమలాపాల్.. తాజాగా తిరుట్టుపయలే-2లో నటించింది. ఈ సినిమాలో అందాలను మోస్తరుగా ఆరబోసిన అమలాపాల్‌కు కోలీవుడ్ టాప్ హీరో అజిత్ సరసన నటించాలట. ఇప్పటిక చేతినిండా ఆఫర్లతో షూటింగ్‌ల్లో బిజీబిజీగా వున్న అమలాపాల్.. అజిత్‌తో నటించాలనే తన మనసులోని కోరికను వెల్లడించింది. 
 
ఇప్పటికే కోలీవుడ్ మెర్సల్ హీరో విజయ్‌తో నటించిన అమలా పాల్.. అజిత్‌తో నటించే ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోనని తెలిపింది. అజిత్ మంచి నటుడని, అంతకుమించి మంచి మనిషి చెప్పుకొచ్చింది. ఆయన సినిమాలంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. అతనితో నటించే అవకాశం లభిస్తే.. తన కెరీర్లో అదే గొప్ప అవకాశంగా భావిస్తానని తెలిపింది. కాగా అజిత్ విశ్వాసం అనే సినిమాలో నటించనున్నారు. ఈ చిత్రంలో అమలాపాల్‌కు ఛాన్స్ వచ్చినా వస్తుందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.