మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 1 నవంబరు 2017 (14:46 IST)

అమలా పాల్‌కు కొత్త చిక్కు... బెంజ్ కారు కొని.. పన్ను చెల్లించకుండా?

సినీ నటి అమలా పాల్ కొత్త చిక్కులో పడింది. కారు నకిలీ రిజిస్ట్రేషన్ వ్యవహారంతో ఆమె ఇబ్బందిలో పడింది. ఈ వ్యవహారంపై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ విచారణకు ఆదేశించారు.

సినీ నటి అమలా పాల్ కొత్త చిక్కులో పడింది. కారు నకిలీ రిజిస్ట్రేషన్ వ్యవహారంతో ఆమె ఇబ్బందిలో పడింది. ఈ వ్యవహారంపై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ విచారణకు ఆదేశించారు. అమలాపాల్ గత ఏడాది పుదుచ్చేరిలో "బెంజ్ ఎస్ క్లాస్" అనే కారును రూ.1.12 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ కారును ఆమె సొంత రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయించాలంటే రూ.20 లక్షలు పన్ను చెల్లించాల్సి వస్తుంది.
 
ఈ పన్ను చెల్లించేందుకు వెనక్కి తగ్గిన అమలాపాల్ పుదుచ్చేరిలోనే నకిలీ చిరునామాతో రిజిస్ట్రేషన్ చేయించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కారును అమలా పాల్ కేరళలో వినియోగిస్తోంది. కారు రిజిస్ట్రేషన్ వ్యవహారంపై జోరుగా వార్తలు రావడంతో స్పందించిన గవర్నర్ నిజానిజాలేంటో తెలుసుకునేందుకు పోలీసులకు ఆదేశించారు. అమలాపాల్‌‌తో పాటు నటుడు భగత్ పాసిల్ సహా పలువురు నటులు ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొంటున్నారు.