పన్ను చెల్లించని ప్రముఖ హీరోయిన్.. చర్య తప్పదా?
పలువురు సెలెబ్రిటీలు, హీరోహీరోయిన్లు విదేశాలను నుంచి లగ్జరీ కార్లను దిగుమతి చేసుకోవడం ఆనవాయితీ. అయితే, ఆ కార్లను తాము నివశించే రాష్ట్రాల్లో దిగుమతి చేసుకుంటే భారీ మొత్తంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
పలువురు సెలెబ్రిటీలు, హీరోహీరోయిన్లు విదేశాలను నుంచి లగ్జరీ కార్లను దిగుమతి చేసుకోవడం ఆనవాయితీ. అయితే, ఆ కార్లను తాము నివశించే రాష్ట్రాల్లో దిగుమతి చేసుకుంటే భారీ మొత్తంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో తమ బినామీల పేర్లపై, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దిగుమతి చేసుకుంటుంటారు. ఆ కోవలోనే మలయాళ బ్యూటీ అమలాపాల్ ఓ కారును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది. ఈ కారుకు చెల్లించాల్సిన రూ.20 లక్షల పన్నును చెల్లించలేదు.
అమలాపాల్ విదేశాల నుంచి బెంజ్ లగ్జరీ కారును దిగుమతి చేసుకుంది. అదీ కూడా పుదుచ్చేరిలోని ఓ విద్యార్థి పేరుతో ఈ కారును దిగుమతి చేసుకున్నట్టు రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. దీంతో కేరళ ప్రభుత్వం వద్ద రెవెన్యూ అధికారులు వివరాలు కోరగా, వారు పూర్తి వివరాలు అప్పగించారు.
బెంజ్ కారును విదేశాల నుంచి కొనుగోలు చేసి పుదుచ్చేరిలోని ఓ ఇంజనీరింగ్ విద్యార్థి పేరుమీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తేలింది. దీంతో పుదుచ్చేరిలో కారును రిజిస్ట్రేషన్ చేసి, కేరళలో నడుపుతున్నట్టు అధికారులు నిర్థారణ అయ్యారు. ఇలా చేయడం వల్ల ఆమె ఏకంగా రూ.20 లక్షల మేరకు పన్ను ఎగవేసినట్టు రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. దీంతో ఆమెపై చర్యలు తీసుకునేందుకు వారు సమాయత్తమవుతున్నారు.