శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 7 సెప్టెంబరు 2017 (11:56 IST)

అమలాపాల్ అక్రమ సంబంధానికి మూడు గంటలే టైమ్?

తిరుట్టుపయలె-2 షూటింగ్ చివరిదశకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్ విషయానికి వస్తే.. ఇందుకు యూ అండ్ ఎ సర్టిఫికేట్ వచ్చింది. ఇంతకీ ఈ సినిమా స్ప

తిరుట్టుపయలె-2 షూటింగ్ చివరిదశకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్ విషయానికి వస్తే.. ఇందుకు యూ అండ్ ఎ సర్టిఫికేట్ వచ్చింది. ఇంతకీ ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే? అమలాపాల్ గ్లామర్ ప్లస్ నటన. బాబీ సింహ, ప్రసన్న అమలా పాల్ నటిస్తున్న ఈ సినిమా నిడివి మూడు గంటలు. 
 
ఈ చిత్రంలో అమలాపాల్ వివాహేతర సంబంధం కలిగిన మహిళగా కనిపించనుంది. ఈ మూడు గంటల సమయంలో అమలాపాల్ భర్తతో కాకుండా ప్రియుడితో గడిపే మహిళగా అదరగొట్టనుందని టాక్ వచ్చింది. 
 
ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లలో గ్లామర్ డోస్ పెంచేసింది. ఆద్యంతం ఆసక్తికరమైన సన్నివేశాలుంటాయని కోలీవుడ్ వర్గాల్లో టాక్. సనం శెట్టి, వివేక్, రోబో శంకర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాను సుశీ గణేశన్ డైరక్ట్ చేశారు. ఏజీఎస్ సంస్థ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతం సమకూర్చుతున్నారు.