శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శనివారం, 19 ఆగస్టు 2017 (12:50 IST)

చాలా మంది నిర్మాతలు నాతో టచ్‌లో ఉన్నారు... అమలా పాల్

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది నిర్మాతలు తనతో టచ్‌లో ఉన్నారనీ కోలీవుడ్ కథానాయిక అమలా పాల్ చెపుతోంది. తమిళ దర్శకుడు విజయన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ... ఆ తర్వాత ఓ యేడాది తిరగ

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది నిర్మాతలు తనతో టచ్‌లో ఉన్నారనీ కోలీవుడ్ కథానాయిక అమలా పాల్ చెపుతోంది. తమిళ దర్శకుడు విజయన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ... ఆ తర్వాత ఓ యేడాది తిరగకముందే విడాకులు తీసుకుంది. ఈ విడాకులు తీసుకోవడానికి ప్రధాన కారణం తమిళ యువ హీరో ధనుష్ అనే పుకార్లూ వచ్చాయి. అయితే, ఇవేమీ పట్టించుకోని అమలా పాల్... సినీ అవకాశాల కోసం వెంపర్లాడుతోంది.
 
నిజానికి ఈ భామకు తమిళంలో మంచి గుర్తింపు ఉంది. కొత్త కథానాయికల పోటీ కారణంగా తెలుగు నుంచి ఆమెకి అవకాశాలు లభించడం లేదు. తమిళంలో తనకి గల పరిచయాల కారణంగా కొన్ని అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతోంది. ఆ కొన్ని అవకాశాలతో కెరియర్‌ను నెట్టుకురావడం కష్టమని భావించి మలయాళ చిత్ర పరిశ్రమపై దృష్టి పెట్టింది. ఫలితంగా మూడు చిత్రాల్లో బుక్ అయింది. 
 
అదే టాలీవుడ్ విషయానికి వస్తే పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ నిర్మాతలు, హీరోలదే రాజ్యం. అయినప్పటికీ తెలుగు నుంచి కూడా తనకి అవకాశాలు బాగానే వస్తున్నాయని ఈ సుందరి చెబుతుండటం విశేషం. చాలామంది దర్శక నిర్మాతలు టచ్‌లో ఉన్నారనీ, కానీ, మంచి కథల కోసం వెయిట్ చేస్తున్నట్టు ఆమె చెప్పుకొచ్చింది.