విజయ్‌తో విడిపోవడం బాధాకరమే.. కానీ కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటా: అమలా పాల్
ఇద్దరమ్మాయిలతో ఫేమ్ అమలాపాల్ వైవాహిక జీవితం గురించి ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడింది. ధనుష్, ఐశ్వర్య, అమలాపాల్ కాంబోలో తెరకెక్కిన వీఐపీ-2 సినిమా కలెక్షన్ల పరంగా కుమ్మేస్తున్న తరుణంలో.. ఈ సినిమా ప
ఇద్దరమ్మాయిలతో ఫేమ్ అమలాపాల్ వైవాహిక జీవితం గురించి ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడింది. ధనుష్, ఐశ్వర్య, అమలాపాల్ కాంబోలో తెరకెక్కిన వీఐపీ-2 సినిమా కలెక్షన్ల పరంగా కుమ్మేస్తున్న తరుణంలో.. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా అమలాపాల్ సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా బయటపెట్టింది. తన వైవాహిక జీవితం చాలా బాధతో కూడుకున్నదని చెప్పుకొచ్చింది.
తన వైవాహిక జీవితంలో ఇబ్బందులు లేవని చెప్పలేం. సంతోషంగా ఉన్నానని చెప్పను. ఎన్నో చేదు అనుభవాలను తామిద్దరం ఎదుర్కొన్నాం. విజయ్-అమలాల మధ్య చాలామంది జోక్యం చేసుకున్నారు. మీడియా కూడా మా నియంత్రణలో లేదు. అయితే విజయ్ లాంటి వ్యక్తి తనకు పరిచయం కావడం.. ఆయన్ని మనువాడటం చాలా సంతోషకరమైన విషయమని.. ఇద్దరూ ఇండస్ట్రీకి చెందిన వారు కావడంతో ఒకరికొకరు ఎంతో సాయం చేసుకునేవాళ్లమని అమలాపాల్ చెప్పింది.
విజయ్‌తో విడాకులు తీసుకోవడాన్ని చెడుగా భావించనని మాజీ భర్తను అమలా పాల్ ప్రశంసించారు. అయితే పరిస్థితులు తమను విడగొట్టాయని అమలాపాల్ స్పష్టం చేసింది. జీవితంలో అన్నీ మనకు అనుకూలంగా జరగవు. అందుకే మంచి భవిష్యత్తు మార్గంలో పయనిస్తున్నానని అమలా పాల్ వెల్లడించింది.
రెండో పెళ్లి గురించి అమలా పాల్ మాట్లాడుతూ.. విజయ్ నుంచి విడిపోవడం బాధాకరమైనప్పటికీ.. కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ప్రేమ అనేది నచ్చదని చెప్పే స్థితిలో తాను లేనని.. కానీ అన్నింటికంటే ముందు తనను తాను ప్రేమించుకోవాలని, కెరీర్‌పై దృష్టి పెట్టాలని వెల్లడించింది. ఇవన్నీ జరిగితే పెళ్లి అదంతట అది జరిగిపోతుందని అమలా పాల్ తెలిపింది.