శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : సోమవారం, 21 ఆగస్టు 2017 (15:22 IST)

అమలాపాల్ తండ్రికి సీరియస్.. అమ్మ మెసేజ్.. థాయ్‌లాండ్ నుంచి పడవలో పరార్..?

''తిరుట్టుపయలె'' సీక్వెల్‌లో బాబి సింహా, ప్రసన్న, అమలాపాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా అమలా పాల్.. యూనిట్‌కు పెద్ద షాక్ ఇచ్చిందని దర్శకుడు సుశీ గణేశన్ తెలిపారు. థాయ్‌లాండ్ క

''తిరుట్టుపయలె'' సీక్వెల్‌లో బాబి సింహా, ప్రసన్న, అమలాపాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా అమలా పాల్.. యూనిట్‌కు పెద్ద షాక్ ఇచ్చిందని దర్శకుడు సుశీ గణేశన్ తెలిపారు. థాయ్‌లాండ్ కొండ ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ ప్రాంతాల్లో సెల్ ఫోన్ టవర్లు వుండవు. ఆ సమయంలో అమలాపాల్‌ తండ్రికి సీరియస్ అంటూ మెసేజ్ వచ్చింది.
 
అయితే అమలా పాల్ తమతో కూడా చెప్పకుండా స్వదేశానికి తిరిగి వెళ్ళేందుకు ప్లాన్ వేసింది. మాతో మాత్రం సెల్ ఫోన్ టవర్ దొరికే ప్రాంతం నుంచి ఫోనులో అమ్మతో మాట్లాడి వస్తానని అసిస్టెంట్‌తో పాటు పడవలో వెళ్ళింది. దీంతో అందరూ షాక్ అయ్యాం. టవర్ దొరికే ప్రాంతంలో నిలబడి అమలా పాల్ వారి అమ్మతో మాట్లాడాకే అసలు విషయం తెలిసిందని సుశీ గణేశన్ చెప్పారు. 
 
ఇంతకీ ఏమైందంటే.. అమలాపాల్‌తో కొన్ని రోజుల పాటు ఫోనులో కూడా మాట్లాడక పోవడంతో ఆమె అమ్మగారు తండ్రికి బాగోలేదని మెసేజ్ పెట్టారని తెలిసింది. దీంతో అమలాపాల్‌ అమ్మపై ఆగ్రహం కూడా వ్యక్తం చేసిందని సుశీ తెలిపారు. ఆ సమయంలో అమలాపాల్ తాము వెళ్ళకపోతే.. అదే బోటులో ఆమె స్వదేశానికి పారిపోయివుండేదని సుశీ గణేశన్ చెప్పారు.